పెంపుడు కుక్కకు కరోనా పాజిటివ్.. యజమాని నుంచే సోకినట్లు నిర్థారణ...

By AN TeluguFirst Published Nov 11, 2021, 1:02 PM IST
Highlights

తాజాగా బ్రిటన్ లో ఓ Pet dogకు కరోనా వైరస్ పాటిజివ్ గా నిర్థారణ అయ్యింది. దాని యజమాని వల్లే ఆ శునకం Corona virus బారిన పడి ఉండొచ్చని జంతు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ మహమ్మారితో నిత్యం లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ మనుషులతోపాటు, జంతువులను కూడా వెంటాడుతోంది. ఇప్పటికే పలు జంతువులకు కరోనా వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. 

అయితే, మనుషుల నుంచే animalsకు కరోనా వ్యాపిస్తుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నప్పటికీ.. ఇది ఇప్పటివరకు నిరూపితం కాలేదు. తాజాగా బ్రిటన్ లో ఓ Pet dogకు కరోనా వైరస్ పాటిజివ్ గా నిర్థారణ అయ్యింది. దాని యజమాని వల్లే ఆ శునకం Corona virus బారిన పడి ఉండొచ్చని జంతు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

యూకేలోని వేబ్రిడ్జ్ లో ఉన్న యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీ (APHA)ల్యాబొరేటరీలో కుక్కకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు యూకే చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ తెలిపారు. ఆ కుక్కకు నవంబర్ 3న Corona Positive గా నిర్థారణ అయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అది చికిత్స పొందుతోందని, దాని పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

శునకం యజమానికి ఈ మధ్య కరోనా బారిన పడ్డారని, ఆయన నుంచే కరోనా వ్యాపించి ఉండొచ్చని వైద్యులు వెల్లడించారు. అయితే ఆయన నుంచే కరోనా వ్యాపించిందనడానికి ఆధారాలు లభించినట్లు చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ క్రిస్టిన్ మైడెల్మిస్ చెప్పారు. అయితే ఆ కుక్క వల్ల ఇతర జీవులకు కరోనా వ్యాప్తి చెందినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.

ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని.. కుక్కలకు Infection కావడం చాలా అరుదని పేర్కొన్నారు. ఇలాంటి సందర్బాల్లో కుక్కలకు లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని.. కొన్ని రోజుల్లోనే అవి కోలుకుంటాయని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కేసు గురించి ప్రపంచ జంతువుల ఆరోగ్య సంస్థకు వివరాలు పంపినట్లు తెలిపారు. దీనిమీద అధ్యయనం కొనసాగుతోందని, త్వరలోనే వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. 

సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్-2021 : శృంగార పురుషుడిగా ఎంపికైన యాంట్-మ్యాన్ నటుడు పాల్ రాడ్

ఇదిలా ఉండగా.. Indiaలో గత 24 గంటల్లో 13,091 కొత్త Corona కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 34,401,670 కోట్లకి చేరింది.మరో వైపు కరోనాతో 340 మంది చనిపోయారు. నిన్న ఒక్క రోజే 11,89,470 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్నటితో పోలిస్తే కరోనా కేసుల  14 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనా నుండి 13,878 మంది కోలుకున్నారు. 

ఇప్పటివకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3,38,00,925కి చేరింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,38,556 లక్షలకు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా యాక్టివ్ కేసులు 0.40 శాతానికి పడిపోయినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా రోగుల రికవరీ రేటు 98.25 గా రికార్డైంది. కరోనా యాక్టివ్ కేసులు 266 రోజుల్లో అత్యల్పంగా నమోదైంది.  ఈ ఏడాది మార్చి తర్వాత కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తక్కువగా రికార్డైందని వైద్య ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు
 

click me!