Asianet News TeluguAsianet News Telugu

సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్-2021 : శృంగార పురుషుడిగా ఎంపికైన యాంట్-మ్యాన్ నటుడు పాల్ రాడ్

 

పీపుల్స్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ 2021గా పాల్ రూడ్ ఎంపికయ్యాడు. ఈ వార్త విని తన భార్య జూలీ యాగెర్ కి మతిపోయిందని చమత్కరించాడు నటుడు.

Ant Man actor Paul Rudd is Sexiest Man Alive 2021. His wife has the best reaction
Author
Hyderabad, First Published Nov 11, 2021, 11:03 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

లాస్ ఎంజెలెస్ : మార్వల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) ఫిలిమ్స్ నుంచి వచ్చిన అనేక చిత్రాలతో పాటు, ‘క్లూలెస్’, ‘దిస్ ఈజ్ 40’ చిత్రాల్లో నటించిన పాల్ రాడ్ పీపుల్స్ మేగజైన్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ (శృంగార పురుషుడు) 2021గా ఎంపికయ్యారు. 

మంగళవారం ‘ద లేట్ షో విత్ స్టేఫెన్ కాల్బెర్ట్’ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. దీనిమీద పాల్ రాడ్ స్పందిస్తూ దీనికి తాను చాలా హార్డ్ గా మొగ్గుచూపుతానని అన్నారు. సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్‌గా ఎంపిక కావడం గురించి నిరాడంబరంగా ఉండటానికి ప్రయత్నించనని రూడ్ చెప్పాడు. "కానీ నా స్నేహితులు నన్ను destroy చేస్తారు. వారి కోసం ఎదురు చూస్తున్నాను. అందుకే వారు నా స్నేహితులయ్యారు”అంటూ చలోక్తులు విసిరారు. 

ఈ వార్తలపై అభిమానులు ఎలా స్పందిస్తారనే దానిపై తనకు సరైన అవగాహన ఉందని రూడ్ మ్యాగజైన్ కవర్ స్టోరీలో రాడ్ చమత్కరించారు. “వాళ్లెలా స్పందిస్తారో నాకు అవగాహన ఉంది, నేను Sexiest Man Alive కోసం ఎంపిక అయ్యానని  విన్నప్పుడు, వారు, ‘ఏమిటి?’ అని ఆశ్చర్యపోతారు. ఇదేం తప్పుడు వ్యవహారం కాదు. కానీ నాకంటే ముందు దీనికోసం ఎంపిక కావాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు” అనిచెప్పుకొచ్చారు. 

అతను సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ టైటిల్‌కి ఎంపికైన విషయాన్ని చెబుతూ, నా భార్య జూలీ యాగెర్ "stupefied" అని వెల్లడించాడు. "ఆమె ఈ విషయంలో చాలా మూర్ఖంగా ఆలోచించింది. ఆ తరువాత ఆమె దాని గురించి చాలా సంతోషపడింది. కాసేపు నవ్వింది, కాసేపు షాక్ అయింది.. ఆ తరువాత ఆమె ‘ఓహ్, వారు సరిగ్గా అర్థం చేసుకున్నారు.’ అది చాలా స్వీట్ అంటూ బదులిచ్చింది. అయితే, ఆమె బహుశా నిజం చెప్పడం లేదేమో, ఆమె ఏమి చెప్పబోతోంది?” అనేది ఉత్సుకతగా ఉంది అని 52 ఏళ్ల నటుడు అన్నారు.

నేరస్తులతో చర్చలు జరుపుతారా?.. ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్తాన్ సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం..

టైటిల్‌ని పొందిన తర్వాత తన జీవితం మారుతుందని తాను ఆశిస్తున్నానని "క్లూనీ, పిట్, బి జోర్డాన్‌లతో కలిసి సెక్సీ డిన్నర్‌లు కొన్నింటికి" తనను ఆహ్వానించే రోజు కోసం ఎదురుచూస్తున్నానని రూడ్ చెప్పాడు. 

అంతకు ముందు ఈ అవార్డు అందుకున్న జాన్ లెజెండ్, డ్వేన్ జాన్సన్, క్రిస్ హేమ్స్‌వర్త్, ఇద్రిస్ ఎల్బా, ఆడమ్ లెవిన్, చానింగ్ టాటమ్, డేవిడ్ బెక్‌హామ్‌లతో సరసన రూడ్ చేరాడు.

రూడ్ ప్రస్తుతం Apple TV ప్లస్ సిరీస్ ది ష్రింక్ నెక్స్ట్ డోర్‌లో నటిస్తున్నాడు. ఇది నవంబర్ 12న ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. దీంతోపాటు అతను నటించిన ఘోస్ట్‌బస్టర్స్ : ఆఫ్టర్‌లైఫ్ విడుదల కోసం సిద్ధంగా ఉంది. అంతేకాకుండా, పాల్ రాడ్ రాబోయే చిత్రం యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్‌లో తన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) పాత్రను స్కాట్ లాంగ్ అకా యాంట్-మ్యాన్‌లో మళ్లీ చేస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios