Andrew Symonds dies: క్రీడాలోకంలో మ‌రో విషాదం.. ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ ఇక‌లేరు

Published : May 15, 2022, 05:47 AM ISTUpdated : May 15, 2022, 06:14 AM IST
Andrew Symonds dies: క్రీడాలోకంలో మ‌రో విషాదం.. ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ ఇక‌లేరు

సారాంశం

Andrew Symonds dies: ఆసీస్ క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు. సైమండ్స్ మృతితో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు  

Andrew Symonds dies: క్రీడా ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. ఆసీస్ దిగ్గజ ఆటగాడు, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు. అతడిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా విఫలమయ్యారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఆండ్రూను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని , అత‌ని ప్రాణాల‌ను కాపాడ‌లేక పోయామ‌ని తెలిపారు.

సైమండ్స్ మ‌ర‌ణ వార్త‌తో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.  ఆయన అభిమానుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.   ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఆటగాడు షేన్ వార్న్ కూడా మరణించిన సంగతి తెలిసిందే.  తాజాగా మరో దిగ్గజ ఆటగాడు మరణించడం క్రికెట్ అభిమానులను శోకసంద్రంలో ముంచింది. సైమండ్స్ మృతి పట్ల ప్రముఖులు, మాజీ ఆటగాళ్లు, క్రీడాభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు తెలిపిన వివ‌రాల  ప్ర‌కారం.. రాత్రి 10:30 గంటలకు నగరానికి పశ్చిమాన 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెర్వీ రేంజ్‌లో ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. వేగంగా వెళ్తున్న కారు రోడ్డుపై బోల్తా కొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్ర‌మాద స‌మ‌యంలో ఆండ్రూ సైమండ్స్  మాత్ర‌మే కారులో ఉన్నట్టు తెలుస్తోంది.  

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆండ్రూ సైమండ్స్‌ను రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా విఫలమయ్యారు. ఈ ప్రమాదంలో సైమండ్స్‌కు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.  అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆండ్రూను రక్షించలేకపోయారు.

Andrew Symonds.. 1998లో పాకిస్థాన్‌పై వన్డేల్లో అరంగేట్రం చేసి.. 2012లో అంతర్జాతీయ క్రికెట్ ప్ర‌పంచానికి గుడ్ బై చెప్పారు. సైమండ్స్ త‌న  క్రికెట్ కెరీర్ లో మొత్తం 198 ODIల్లో 5088 రన్స్ చేయగా.. ఇందులో ఆరు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  అలాగే..  2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ఆరంభించిన ఈ దిగ్గజ ఆటగాడు త‌న కెరీర్ లో 26 మ్యాచ్‌ల్లో 1462 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 37.33 యావరేజ్‌తో 24 వికెట్లు పడగొట్టాడు.

అలాగే.. 14 టీ20లు ఆడి.. రెండు హాఫ్ సెంచరీల సాయంతో 337 పరుగులు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 165 వికెట్లు తీశాడు. బెస్ట్ బౌలింగ్ 18 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్ జట్లకు సైమండ్స్ ప్రాతినిధ్యం వహించాడు.  


 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే