కరోనా వైరస్ పై పరిశోధన... అమెరికాలో చైనా శాస్త్రవేత్త హత్య

By telugu news team  |  First Published May 7, 2020, 12:51 PM IST

పిట్స్ బర్గ్ కు ఉత్తరాన రాస్ టౌన్ షిప్ లోని తన నివాసంలో లియు శనివారం శవమై కనిపించారు. హో గు అనే వ్యక్తి ఆయనను కాల్చి చంపి.. ఆపై తనను తాను కాల్చుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.


కరోనా వైరస్ పై కీలక పరిశోధనలు చేస్తున్న ఓ చైనా శాస్త్రవేత్తను అమెరికాలో అతి దారుణంగా హత్య చేశారు. చైనా పరిశోధకుడు బింగ్ లియు(37) అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో హత్యకు గురయ్యారు. ఆయన పిట్స్ బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు.

పిట్స్ బర్గ్ కు ఉత్తరాన రాస్ టౌన్ షిప్ లోని తన నివాసంలో లియు శనివారం శవమై కనిపించారు. హో గు అనే వ్యక్తి ఆయనను కాల్చి చంపి.. ఆపై తనను తాను కాల్చుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హో మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు.

Latest Videos

undefined

కరోనా వైరస్ సోకినప్పుడు కణ స్థాయిలో చోటుచేసుకునే మార్పులను పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే దిశగా జరిపిన ప్రయోగాల్లో కీలక ముందంజ వేసిన సమయంలో లియు  ఈ హత్యకు గురికావడం గమనార్హం. ఆయనను ఎందుకు హత్య చేశారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. 

కాగా.. అమెరికాలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాల్చింది. ఇప్పటి వరకు దాదాలపు 70వేల మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 13లక్షల మందికి ఈ వైరస్ సోకి బాధపడుతున్నారు. రోజు రోజుకీ అక్కడ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దానిని అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. కాగా... ఈ వైరస్ చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపించింది.

click me!