కరోనా లాక్ డౌన్.. రోడ్డుపై సింహాల నిద్ర

By telugu news team  |  First Published Apr 17, 2020, 2:11 PM IST
దక్షిణాఫ్రికాలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అడవిలోని సింహాలన్నీ రోడ్డుపైకి వచ్చి ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. దీనిని ఓ వ్యక్తి ఫోటో తీయగా.. అది కాస్త వైరల్ అయింది.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ ని అరికట్టడానికి పలు దేశాల్లో లాక్ డౌన్ విధించారు. దీంతో ప్రజలంతా ఇంటి గడప కూడా దాటకుండా లోపలే ఉండిపోతున్నారు. కేవలం నిత్యవసరాలకు మాత్రమే బయటకు అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో.. రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి.

కాగా.. ఈ నేపథ్యంలో.. దక్షిణాఫ్రికాలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అడవిలోని సింహాలన్నీ రోడ్డుపైకి వచ్చి ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. దీనిని ఓ వ్యక్తి ఫోటో తీయగా.. అది కాస్త వైరల్ అయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాలో నిత్యం రద్దీగా ఉండే ఓ ప్రాంతం లాక్ డౌన్ తో ఖాళీగా మారిపోయింది. రోడ్డు లాక్ డౌన్‌తో నిర్మానుష్యంగా మారడంతో ఒక సింహాల గుంపు రోడ్లపై విశ్రాంతి తీసుకోవడాన్ని రిచర్డ్ సౌరీ అనే వ్యక్తి  గమనించారు.

దీంతో వాటిని ఫోటోలు తీశారు. అవి గాఢ నిద్రలో ఉండటంతో.. అతను ఫోటోలు తీసిన విషయం కూడా వాటికి తెలీదు. నిజానికి సింహాలు, పులులు ఎక్కువగా రాత్రి వేళల్లో తిరుగుతాయి. కానీ జనసంచారం లేకపోవడంతో.. అక్కడ పగలు కూడా హాయిగా తిరుగుతున్నాయి. 
click me!