అమెరికాలో 30వేలు దాటిన మరణాలు.. గంటకు 107మంది మృతి

By telugu news teamFirst Published Apr 17, 2020, 7:22 AM IST
Highlights
అమెరికా తర్వాత కరోనా మరణాలు ఎక్కువ నమోదైన దేశం ఇటలీ. అమెరికా జనాభాలో ఐదవ వంతు జానాభా ఉన్న ఇటలీలో ఇప్పటివరకు 21,645కరోనా మరణాలు సంభవించాయి.
అమెరికాలో కరోనా మృత్యు ఘోష స్పష్టంగా వినపడుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అక్కడ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి గంటకు 107మంది ప్రాణాలు కోల్పతున్నారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు.

అమెరికాలో  గురువారం కరోనా మరణాల సంఖ్య  30వేల మార్క్ దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ తెలిపిన వివరాల ప్రకారం...అమెరికాలో ఇప్పటివరకు 30,990కరోనా మరణాలు సంభవించాయి. ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ అమెరికాలో నమోదైనన్ని కరోనా మరణాలు నమోదవలేదు. 

అమెరికా తర్వాత కరోనా మరణాలు ఎక్కువ నమోదైన దేశం ఇటలీ. అమెరికా జనాభాలో ఐదవ వంతు జానాభా ఉన్న ఇటలీలో ఇప్పటివరకు 21,645కరోనా మరణాలు సంభవించాయి. ఇక కరోనా మరణాల్లో మూడవస్థానంలో స్పెయిన్ నిలిచింది. స్పెయిన్ లో ఇప్పటివరకు 17,167కరోనా మరణాలు నమోదయ్యాయి.

ఇక,కరోనా కేసుల్లో కూడా అమెరికానే టాప్ లో నిలిచింది. యూఎస్ లో కరోనా కేసుల సంఖ్య 6లక్షల 46వేలుగా ఉంది. అటు మరణాలు,ఇటు కేసులు రెండింటిలో అమెరికానే అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా న్యూయార్క్ లో పరిస్థితి దారుణంగా ఉంది.  ప్రపంచంలోని ఏ దేశంలో నమోదవనన్ని కరోనా కేసులు ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. అంతేకాకుండా అమెరికాలో నమోదైన కరోనా మరణాల్లో దాదాపు సగం న్యూయార్క్ లోనే నమోదయ్యాయి.
click me!