కరోనా వైరస్: లక్షణాలను కనిపెట్టేది ఇలాగే!

By Sree sFirst Published Mar 12, 2020, 3:41 PM IST
Highlights

ఆసుపత్రుల్లోనేమో కరోనా వైరస్ ను గుర్తించడం ప్రహసనంగా రెండు నుంచి మూడు రోజులు పట్టే వ్యవహారం....  ఎయిర్ పోర్టుల్లో ఎందుకంత సత్వరంగా అయిపోతుందో అన్న విషయం అందరి మనసుల్లోనూ మెదలడం సహజం. ఈ నేపథ్యంలో అసలు అక్కడ జరిగేదేమిటి అనేది ఒకసారి తెలుసుకుందాం.  

కరోనా... ప్రపంచంలో ఇప్పుడు ఈ పేరు చెబితే భయపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎవరు దగ్గినా తుమ్మినా కూడా అనుమానించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇది ఒక రకంగా మంచిదే. 

అందరూ ఇంతలా భయపడుతున్న కరోనా వ్యాధితో ఉన్నవారిని గుర్తించడానికి ఏవేవో టెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్ లో కానీ ఎక్కడ కానీ టెస్టు చేసినా ఆ శాంపిల్ ను పూణే పంపిస్తున్నారు. అక్కడ మాత్రమే దాన్ని పరిశీలించి ఫైనల్ రిపోర్ట్స్ ని వివిధ నగరాలకు పంపుతున్నారు. 

ఇదంతా బాగానే ఉంది కానీ మనం ఎయిర్ పోర్టుల్లో తరుచుగా ఒక స్కానర్ లాంటిది పట్టుకొని ప్రతి ఒక్కరిని ఒకసారి ఫోటో తీసి కరోనా లేదు అని నిర్ధారించుకొని పంపించేస్తున్నారు. వాటినే థర్మల్ ఇమేజింగ్  కెమెరాలు అంటారు. 

Also read: ఏపీలో మరో రెండు కరోనా కేసులు..? అనకాపల్లిలో కలకలం

ఆసుపత్రుల్లోనేమో కరోనా వైరస్ ను గుర్తించడం ప్రహసనంగా రెండు నుంచి మూడు రోజులు పట్టే వ్యవహారం....  ఎయిర్ పోర్టుల్లో ఎందుకంత సత్వరంగా అయిపోతుందో అన్న విషయం అందరి మనసుల్లోనూ మెదలడం సహజం. ఈ నేపథ్యంలో అసలు అక్కడ జరిగేదేమిటి అనేది ఒకసారి తెలుసుకుందాం.  

థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు కరోనాను ఎలా గుర్తిస్తాయి?

సాధారణ కెమెరాలు కాంతిని గ్రహించి మన ఫోటోలను తీస్తాయి. కానీ అందుకు భిన్నంగా ఈ థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు మన శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా పని చేస్తాయి. అందులోని థర్మామీటర్లు చాలా శక్తివంతమైనవి, సున్నితమైనవి. 

అవి డిగ్రీలో పదవ వంతు వేడిని కూడా పసిగట్టగలుగుతాయి. సాధారణంగా కరోనా లక్షణాల్లో జ్వరం కూడా ఒకటి. మనిషి శరీర ఉష్ణోగ్రతను అనుసరించి ఇవి పనిచేస్తాయి కాబట్టి.... మనిషి శరీరం సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉంటే వెంటనే ఇందులో తెలిసిపోతుంది. 

సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత 36-37 డిగ్రీల మధ్య ఉంటుంది. ఎవరి శరీరమైనా ఇంతకన్నా ఎక్కువ టెంపరేచర్ ను గనులా కలిగి ఉంటే... వెంటనే వారిని కరోనా పరీక్షలకు తరలిస్తారు. అంతే తప్ప ఈ కెమెరాలు నేరుగా కరోనా వైరస్ ను గుర్తించలేవు. 

Also read: బ్రేకింగ్... వైద్యశాఖ మంత్రికి కరోనా వైరస్

కాబట్టి ప్రాథమికంగా మనిషి జ్వరంగా ఉండడం కరోనాలో ఒక ముఖ్యమైన లక్షణం గనుక జ్వరం వచ్చిన వారిని మాత్రమే మనం ఇలా గుర్తిస్తాము. ఇలా గుర్తించిన వారిని తదుపరి కరోనా పరీక్షల కోసం పంపిస్తారు. అవి సాధారణ పరీక్షల్లనే ఉంటాయి. 

ఇది థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు పనిచేసే విధానం. అవి కరోనాను గుర్తుపట్టే విధానం. 

click me!