కరోనా పెళ్లాం లాంటిది.. కంట్రోల్ చేయగలం అనుకుంటాం కానీ: ఇండోనేషియా మంత్రి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 29, 2020, 5:01 PM IST
Highlights

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అల్లాడుతుంటే. ఆ మహమ్మారిపై సెటెర్లు వేసి ఇండోనేషియాకు చెందిన ఓ మంత్రిపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. 

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అల్లాడుతుంటే. ఆ మహమ్మారిపై సెటెర్లు వేసి ఇండోనేషియాకు చెందిన ఓ మంత్రిపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి.

వివరాల్లోకి వెళితే... ఇండోనేషియా భద్రతా మంత్రి మహ్మద్ మహ్ఫూద్ ఎండీ లాక్‌డౌన్ సడలింపులపై ప్రజల్లో భయాన్ని తొలగిస్తూ వారికి మానసిక స్థైర్యాన్ని ఇచ్చేలా ఉపన్యాసం ఇచ్చారు.

కరోనా వైరస్ తిరుగుబాటు వ్యక్తిత్వం కలిగిన భార్య లాంటిదని అన్నారు. మన ఆరోగ్యం పట్ల అన్ని శ్రద్ధలు తీసుకునే దేశంలో లాక్‌డౌన్‌ను ఎత్తేయబోతున్నామన్న మహ్ఫూద్ తన సహోద్యోగి పంపిన మీమ్ గురించి ప్రస్తావించారు.

Also Read:ఇంట్లో కూడా మాస్క్ ధరించాల్సిందేనా..?

కరోనా మీ భార్య లాంటిది.. మొదట్లో మీరు ఆమెను కంట్రోల్ చేయాలని అనుకుంటారు. అయితే అది తనవల్ల కాదని తర్వాత తెలుసుకుంటారు. ఇక చేసేదేమీ లేక సహజీవనం ప్రారంభిస్తారు అని ఆ మీమ్ సారాంశాన్ని తెలియజేశారు.

అక్కడితే ఆగకుండా ప్రస్తుతం దేశంలో, ప్రపంచంలో అలాంటి పరిస్ధితే ఉందని మహ్ఫూద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఆయనపై మహిళా సంఘాలు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

Also Read:కరోనా కాలంలో ఒక్కటైన డాక్టర్, నర్స్

మహ్మద్ మహ్ఫూద్‌ చేసిన వ్యాఖ్యలు కోవిడ్ 19 నివారణపై ఇండోనేషియా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మాత్రమే కాకుండా సదరు మంత్రి యొక్క సెక్సీయెస్ట్ ఆలోచన విధానాన్ని ప్రతిభింబిస్తోంది.

అని వుమెన్స్ సాలిడేరిటీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దిండా నిసా యురా అన్నారు. కాగా ఇండోనేషియాలో ఇప్పటి వరకు 24,000 మంది కరోనా బారినపడగా.. 1,496 మంది ప్రాణాలు కోల్పోయారు. 

click me!