Colombia Plane Crash: 110 మంది సైనికులతో వెళ్తున్న విమానం కూలిపోయింది.. అసలేం జరిగింది?

Published : Mar 23, 2026, 10:35 PM IST
Colombia Military Plane Crash 110 Soldiers Onboard C130 Hercules

సారాంశం

Colombia Plane Crash: కొలంబియాలోని పుట్యుమాయో ప్రాంతంలో 110 మంది సైనికులతో వెళ్తున్న ఆర్మీ విమానం టేకాఫ్ అవుతుండగా కూలిపోయింది. భారీగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం.

Colombia Plane Crash: దక్షిణ కొలంబియాలోని పుట్యుమాయో ప్రావిన్స్‌లో ఒక భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కొలంబియా వైమానిక దళానికి చెందిన 'లాక్ హీడ్ మార్టిన్ హెర్క్యులస్ సి-130' (Hercules C-130) రవాణా విమానం కూలిపోయింది. ఈ విమానంలో సుమారు 110 మంది సైనికులు ప్రయాణిస్తున్నట్లు స్థానిక మీడియా సంస్థ బ్లూ రేడియో వెల్లడించింది. పెరూ సరిహద్దుకు సమీపంలోని పుూర్టో లెగుయిజామో ఎయిర్‌ఫీల్డ్ నుండి ఈ విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం నేలపై పడగానే భారీగా మంటలు చెలరేగాయి.

సరిహద్దు ప్రాంతంలో ప్రమాదం

కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో ఆర్నుల్ఫో సాంచెజ్ ఈ ప్రమాదంపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. అమెజాన్ అడవుల మధ్య ఉన్న దక్షిణ సరిహద్దు ప్రాంతంలో భద్రతా దళాలను తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని ఆయన పేర్కొన్నారు. విమానం కూలిన ప్రదేశం పట్టణ కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని మంత్రి తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 80 నుండి 110 మంది వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు

ప్రమాద వార్త తెలిసిన వెంటనే సైనిక విభాగాలు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానం మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు సూచిస్తున్నాయి. భారీగా ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "ఇది దేశానికి అత్యంత బాధాకరమైన సమయం. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని మంత్రి సాంచెజ్ భావోద్వేగంగా స్పందించారు. గత నెలలో కూడా ఇటువంటిదే మరొక హెర్క్యులస్ విమానం బొలీవియాలో కూలి 20 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol History: బీర్‌ తాగేప్పుడు చీర్స్ చెప్పుకుంటే మంచిది కాదా.? చరిత్ర ఏం చెబుతోంది..
ప్రపంచంలో అత్యంత ‘అన్ హ్యాపీ’ దేశం ఏంటో తెలుసా.? పాపం ఎలా బతుకున్నారో ఏమో..