ఉక్రెయిన్ నుంచి మీ కూతురిని వెనక్కి తెస్తామని పీఎంవో నుంచి కాల్ చేసినట్టుగా బురిడీ.. చీట్ చేసిన దుండగుడు

Published : Feb 27, 2022, 02:18 PM IST
ఉక్రెయిన్ నుంచి మీ కూతురిని వెనక్కి తెస్తామని పీఎంవో నుంచి కాల్ చేసినట్టుగా బురిడీ.. చీట్ చేసిన దుండగుడు

సారాంశం

ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని హర్యానాకు చెందిన ఓ దుండగుడు మధ్యప్రదేశ్‌కు చెందిన విల్సన్ వైశాలిని మోసం చేశాడు. ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న తన కూతురిని వెనక్కి తేవడానికి ఫ్లైట్ టికెట్ ఖర్చు అరేంజ్ చేయాలని పీఎంవో కార్యాలయం నుంచి ఫోన్ చేసినట్టు నమ్మించాడు. డబ్బులు రాగానే.. కమ్యూనికేషన్ కట్ చేసుకున్నాడు.  

భోపాల్: నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ సామాన్యులను మోసం చేస్తుంటారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ కూడా అవుతుంటారు. ఫ్రాడ్ చేయడానికి ఇప్పుడు ఎక్కువగా టెక్నాలజీని ఫాలో అవుతున్నారు. అయితే, ఆయా స్థల కాలాలను బట్టి, అందివచ్చిన విపత్తులు, ఉపద్రవాలనూ ఇప్పుడు మోసాలకు వాడుకుంటున్నట్టు వెల్లడి అయింది. అవును.. ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడులు చేయడంతో ప్రపంచ దేశాలన్నీ గందరగోళంలో మునిగిపోయాయి. ఆ దేశంలోని తమ పౌరులను ఎలా స్వదేశానికి రప్పించాలా? అనే ఆలోచనల్లో మునిగిపోయి ఉండగా.. మధ్యప్రదేశ్‌లో ఓ దుండగుడు ఈ సంక్షోభాన్ని కూడా తన మోసానికి వినియోగించుకున్నాడు. ఉక్రెయిన్ తమ పిల్లలను పంపించిన తల్లిదండ్రుల నిస్సహాయ స్థితిని క్యాష్ చేసుకుంటున్నారు.

హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన 35 ఏళ్ల ప్రనిన్స్ గవా నిరుద్యోగి. డబ్బుల కోసం ఈజీ మనీ రూట్ ఎంచుకున్నాడు. మోసాలు చేసి సులువుగా డబ్బులు సంపాదించే మార్గం పట్టాడు. ఈ సారి ఉక్రెయిన్ సంక్షోభాన్ని తన ఫ్రాడ్‌కు అనుకూలంగా మలుచుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన వైశాలి విల్సన్ కూతురు ఉక్రెయిన్‌లో చదువుకుంటున్నది. రష్యా ఆ దేశంపై దాడులు చేయడంతో ఆమె అక్కడే బిక్కుబిక్కు మంటూ ఉండిపోయారు. కేంద్ర ప్రభుత్వం కూడా తరలింపు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని నిందితుడు ప్రిన్స్ గవా వైశాలి విల్సన్‌కు కాల్ చేశాడు. తాను ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్టు నమ్మబలికాడు. ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న తన కూతురిని తిరిగి స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నాడు. అన్ని అరేంజ్‌మెంట్లు చేస్తున్నామని, ఫ్లైట్ టికెట్‌కు రూ. 42 వేలు అందించాలని కోరాడు. దీంతో ఆ కాల్ నిజంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినదిగానే ఆమె నమ్మారు. ఆ డబ్బులను మొబైల్ బ్యాంక్ ద్వారా డబ్బులను పంపించారు. ఆ తర్వాతి రోజు నుంచి ప్రిన్స్ గవా ఫోన్ పని చేయలేదు. 

తాను మోసపోయినట్టు గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. గవాను హర్యానాలోని గురుగ్రామ్ నుంచి శుక్రవారం అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయమే మధ్యప్రదేశ్‌లోని విదిశకు తీసుకువచ్చారు. ఐపీసీ, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయన హర్యానాలోనూ పలు నేరాలు చేసినట్టు తేలిందని కొత్వాలి పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అశుతోష్ సింగ్ వివరించారు. గవాను 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. భారత ప్రభుత్వం Operation Ganga పేరిట ఈ తరలింపు ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను ఆ దేశ సరిహద్దుల్లోని రొమేనియా, హంగేరి దేశాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి వారిని రొమేనియా రాజధాని బుకారెస్ట్, హంగేరి రాజధాని బుడాపెస్ట్‌‌లకు తరలిస్తున్నారు. బుకారెస్ట్, బుడాపెస్ట్‌లకు చేరుకన్న భారతీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలిస్తున్నారు. 

ఇప్పటికే రెండు విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. తొలి విమానం బుకారెస్ట్ నుంచి 219 మంది భారతీయలుతో శనివారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్న వారికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు. ఇక, రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి బయలుదేరిన రెండో విమానం ఆదివారం తెల్లవారుజామున Delhi airportకు చేరుకుంది. ఇందులో 250 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ ఎయిర్‌పోర్ట్‌లో విద్యార్థులకు స్వాగతం పలికారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే