కరోనా వైరస్ బయటపెట్టిన జర్నలిస్ట్‌కు నాలుగేళ్ల జైలు

By narsimha lodeFirst Published Dec 28, 2020, 8:44 PM IST
Highlights

కరోనా వైరస్ వుహాన్ లో బయటపడిందని రిపోర్టు చేసినందుకుగాను చైనా జర్నలిస్ట్ కు నాలుగేళ్ల జైలు శిక్ష ను విధించింది చైనా కోర్టు.

బీజింగ్:కరోనా వైరస్ వుహాన్ లో బయటపడిందని రిపోర్టు చేసినందుకుగాను చైనా జర్నలిస్ట్ కు నాలుగేళ్ల జైలు శిక్ష ను విధించింది చైనా కోర్టు.

వైరస్ బారిన పడిన చైనా ప్రజలకు సరైనా వైద్యాన్ని అందించడం లేదని ప్రభుత్వాన్ని పదే పదే ఆ జర్నలిస్ట్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

జాంగ్ జాన్ అనే చైనా జర్నలిస్ట్ కు సోమవారం నాడు చైనా కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ విషయమై పై కోర్టులో అప్పీల్ చేస్తామని జాన్ తెలిపారు.

జాంగ్ గతంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆ వృత్తిని వదిలి జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె ప్రత్యక్ష నివేదికలు, వ్యాసాలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టులు అధికారుల దృష్టిని ఆకర్షించాయి. 

వైరస్ బారినపడి ప్రజలు మృతి చెందుతున్నా చైనా సర్కార్  వైద్యుల నోళ్లకు తాళాలు వేసిందని ఆమె తన వ్యాసాల్లో విమర్శలు గుప్పించారు. ఈ వైరస్ బారినపడిన రోగులు, వైద్యుల ఇంటర్వ్యూలను ఆమె ప్రచురించారు. 

జాంగ్ ను అరెస్ట్ చేసిన ఏడు మాసాల తర్వాత  షాంఘై పుడాంగ్ న్యూడిస్ట్రిక్ పీపుల్స్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. తప్పుడు నివేదికలను జాంగ్ ప్రచారం చేశారని  కోర్టు అభిప్రాయపడింది. 

ప్రాసిక్యూటర్  చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. జాంగ్ ను విడుదల చేయాలని కోర్టు ముందు సామాజిక కార్యకర్తలు  నిరసనకు దిగారు. 

ఈ ఏడాది జూన్ లో ఆమె నిరహారదీక్షను ప్రారంభించింది. అయితే ఆమెతో బలవంతంగా ప్రభుత్వం అన్నం తినిపించింది. ఆమె ఆరోగ్యం క్షీణించిందని ఆమె తలనొప్పి, కడుపునొన్పితో బాధపడుతోందని వీల్ చైర్ లో కోర్టుకు హాజరైనట్టుగా జాంగ్ న్యాయ బృందం తెలిపింది.


 

click me!