అమెరికా: గర్జించిన తుపాకీ, ముగ్గురు మృతి

Siva Kodati |  
Published : Dec 27, 2020, 02:25 PM IST
అమెరికా: గర్జించిన తుపాకీ, ముగ్గురు మృతి

సారాంశం

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. ఇల్లినాయిస్‌‌లో శనివారం ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. క్రీడా మైదానంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. ఇల్లినాయిస్‌‌లో శనివారం ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. క్రీడా మైదానంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఒక అనుమాతుడిని అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని, ఘటన జరిగిన డాన్‌ కార్టర్‌ క్రీడా మైదానానికి సమీపంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాక్‌ఫోర్డ్‌ సిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి