అత్యాచారం నిందితుడితో పాటు యువతి అరెస్ట్... తట్టుకోలేక హార్ట్ ఎటాక్...

Published : Jul 01, 2021, 11:39 AM IST
అత్యాచారం నిందితుడితో పాటు యువతి అరెస్ట్... తట్టుకోలేక హార్ట్ ఎటాక్...

సారాంశం

అత్యాచారం నిందితుడితో పాటు తనను అరెస్టు చేశారని ఆవేదనతో ఓ యువతి గుండెపగిలి మరణించింది.  ఈ దారుణ ఘటన ఈడిన్ బర్గ్ లో నిరుడు చోటుచేసుకుంది.   

అత్యాచారం నిందితుడితో పాటు తనను అరెస్టు చేశారని ఆవేదనతో ఓ యువతి గుండెపగిలి మరణించింది.  ఈ దారుణ ఘటన ఈడిన్ బర్గ్ లో నిరుడు చోటుచేసుకుంది. 

2020 డిసెంబర్ లో చోటు చేసుకున్న ఈ సంఘటనపై స్థానిక కోర్టు  విచారణకు సిద్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 2020 డిసెంబర్ 22న స్కాట్‌ల్యాండ్,  ఎబర్‌డీన్‌కు చెందిన ఓ యువతి షానియా కొల్నిన్స్‌(19)ను ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన కారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే, 28 ఏళ్ల ఓ అత్యాచారం నిందితుడితో తనను అరెస్టు చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను అంబులెన్స్లో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

 ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఎబర్‌డీన్‌ షెర్రీఫ్‌ కోర్టు తాజాగా ఈ సంఘటనను సంబంధించి విచారణకు సిద్ధమైంది.  ఆగస్టు 11వ తేదీన విచారణ చేయనుంది. కాగా ఈ సంఘటనకు సంబంధించి పోలీసులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ