ఇంటర్నెట్ పై చైనా ఉక్కుపాదం :4000 సైట్ల మూసివేత

By Nagaraju TFirst Published Sep 22, 2018, 3:57 PM IST
Highlights

ఇంటర్నెట్‌పై చైనా ఉక్కుపాదం మోపింది. ఆన్‌లైన్‌లో ప్రమాదకర సమాచారాన్ని పంపిణీ చేస్తున్నాయంటూ నాలుగు వేలకు పైగా సైట్లను మూసేసింది. ఇప్పటికే ఇంటర్నెట్‌పై చైనా పట్టుబిగించింది. కఠినమైన సెన్సార్ షిప్ ను అమలు చేస్తుంది. బూతు, జూదం, మతప్రచారం, వదంతులు వ్యాపింపజేసే సైట్లను ఏమాత్రం సహించడం లేదు. 

చైనా: ఇంటర్నెట్‌పై చైనా ఉక్కుపాదం మోపింది. ఆన్‌లైన్‌లో ప్రమాదకర సమాచారాన్ని పంపిణీ చేస్తున్నాయంటూ నాలుగు వేలకు పైగా సైట్లను మూసేసింది. ఇప్పటికే ఇంటర్నెట్‌పై చైనా పట్టుబిగించింది. కఠినమైన సెన్సార్ షిప్ ను అమలు చేస్తుంది. బూతు, జూదం, మతప్రచారం, వదంతులు వ్యాపింపజేసే సైట్లను ఏమాత్రం సహించడం లేదు. 

ఈ ఏడాది మే నెలలో 120 ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు అవకతవకలను సరిచేయాల్సిందిగా 230 కంపెనీలకు నోటీసులు పంపింది. ఆగస్టు చివరినాటికి 1,43,000 పేజీలను తొలగించారు. 

అసభ్య విలువల్ని, అశ్లీలతను, బూతును ప్రచారం చేసే ఆన్‌లైన్ కంటెంట్‌పై అధికారులు చర్యలు తీసుకుంటోంది చైనా ప్రభుత్వం. కాంబోడియా నుంచి నడుపుతున్న ఓ లైవ్ బూతు సైటును సైతం అధికారులు కనిపెట్టి మూసేయించారు.

click me!
Last Updated Sep 22, 2018, 3:57 PM IST
click me!