పోర్న్ వెబ్ సైట్ల నిషేధం... ప్రభుత్వ నిర్ణయం

By ramya neerukondaFirst Published Sep 22, 2018, 3:17 PM IST
Highlights

ఈ పోర్న్ వెబ్ సైట్లు, అశ్లీల దృశ్యాలు...యువతను రెచ్చేగొట్టేలా ఉంటున్నాయని.. అందువల్లే దారుణాలు జరుగుతున్నాయని ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. 

పోర్న్ వెబ్ సైట్లపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రస్తుతం ఈ పోర్న్ వెబ్ సైట్లు లక్షల కొద్దీ ఉన్నాయి. వీటిని చూసేవారి సంఖ్య కూడా తక్కేవేమీ కాదు. కాగా.. వీటిని చూసే చాలా మంది అమాయక యువతులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని నేపాల్ ప్రభుత్వం భావించింది. అందుకే వాటిని పూర్తిగా బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఈ పోర్న్ వెబ్ సైట్లు, అశ్లీల దృశ్యాలు...యువతను రెచ్చేగొట్టేలా ఉంటున్నాయని.. అందువల్లే దారుణాలు జరుగుతున్నాయని ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే అలాంటి వెబ్‌సైట్లను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అసభ్యకరమైన దృశ్యాలను ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నిబంధనలు పాటించని వెబ్‌సైట్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

click me!