వరదలు, కార్చిచ్చు, కరోనా.. ఇప్పుడు కొత్తగా ఎలుకలు: ఇండియానే దిక్కంటున్న ఆస్ట్రేలియా

Siva Kodati |  
Published : May 30, 2021, 03:14 PM IST
వరదలు, కార్చిచ్చు, కరోనా.. ఇప్పుడు కొత్తగా ఎలుకలు: ఇండియానే దిక్కంటున్న ఆస్ట్రేలియా

సారాంశం

న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా పెరిగిపోయిన వీటి సంతతి అక్కడ ప్రజాజీవనానికి భంగం కలిగిస్తోంది. పంటపొలాలు, నివాస గృహాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు... ఇలా ఎక్కడ చూసినా ఎలుకలే దర్శనమిస్తున్నాయి. 

ప్రపంచంలోని అన్ని దేశాలు ఇప్పుడు కరోనాతో, వివిధ రకాల అంతర్యుద్ధాలతో పోరాటం చేస్తుంటే ఆస్ట్రేలియాకి మాత్రం వెరైటీ సమస్య వచ్చి పడింది. అది కూడా ఎలుకల సమస్య. మూషికాలు అన్ని దేశాల్లోనూ వున్నాయి. వాటితో వచ్చిన ఇబ్బంది ఏంటీ అంటారా. వివరాల్లోకి వెళితే.. న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా పెరిగిపోయిన వీటి సంతతి అక్కడ ప్రజాజీవనానికి భంగం కలిగిస్తోంది. పంటపొలాలు, నివాస గృహాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు... ఇలా ఎక్కడ చూసినా ఎలుకలే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ వైపు చూస్తోంది.

Also Read:ఈ ఎలుకలు ఎoత పని చేశాయో చూడండి ( వీడియో )

ఎలుకల నివారణలో ఉపయోగించే బ్రోమాడియోలోన్ విష పదార్థం కొనుగోలుకు భారీ ఆర్డర్ బుక్ చేసింది. భారత్ నుంచి దాదాపు 5,000 లీటర్ల బ్రోమాడియోలోన్ కొనుగోలు చేసి ఎలుకలను అంతం చేయాలని ఆస్ట్రేలియా అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందుకోసం న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం రూ.3,600 కోట్ల నిధులు కేటాయించింది. ఇక్కడి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తక్షణం ఎలుకల సంహారం మొదలుపెట్టనున్నారు. కార్చిచ్చు, వరదల వంటి విపత్తులతో ఇప్పటికే నష్టపోయిన ఆస్ట్రేలియాను ఇప్పుడీ ఎలుకల బెడద తీవ్రంగా వేధిస్తోంది.
 

PREV
click me!

Recommended Stories

Petrol Price: రూపాయికే లీట‌ర్ పెట్రోల్‌.. ఇంత త‌క్కువ ధ‌ర‌కు కార‌ణం ఏంటో తెలుసా.?
Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..