చైనాలో రివర్స్: కరోనావైరస్ జీరో డెమెస్టిక్ ఇన్ఫెక్షన్ రికార్డు

By telugu teamFirst Published Mar 19, 2020, 12:28 PM IST
Highlights

కరోనావైరస్ నుంచి చైనాకు ఊరట లభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా చైనాలో కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. చైనాలోని వూహన్ లో కరోనావైరస్ పుట్టి ప్రపంచమంతా వ్యాపించిన విషయం తెలిసిందే.

బీజింగ్: కరోనా వైరస్ లేదా కోవిడ్ 19 నుంచి చైనాకు ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో మరింతగా కరోనావైరస్ వ్యాపిస్తుండగా, చైనాలో మాత్రం రివర్స్ ధోరణి ప్రారంభమైంది. కరోనావైరస్ చైనాలో పుట్టి ఇతర దేశాలకు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ మీద చేసిన సమరంలో చైనా విజయం సాధించినట్లే కనిపిస్తోంది. 

తమ దేశంలో మొదటిసారి జీరో డొమెస్టిక్ ఇన్ఫెక్షన్స్ నమోదైనట్లు బీజింగ్ వర్గాలు చెప్పాయి. అయితే, విదేశాల నుంచి వచ్చే కరోనా అనుమానిత కేసులు చైనాను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా పుట్టిన వూహన్ నగరంలో కొత్తగా కరోనా కేసులేవీ నమోదుకాలేదని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. 

జనవరి 23వ తేదీ నుంచే వూహన్ లోని కోటీ పది లక్షల మందిని స్ట్రిక్ట్ క్వారంటైన్ చేశారు.  ఆ తర్వాత హుబీ ప్రావిన్స్ లోను, ఇతర రాష్ట్రాల్లోనూ నాలుగు కోట్ల మందిని క్వారంటైన్ చేశారు. ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకున్నారు. 

హుబీ ప్రావిన్స్ లో 8 మరణాలు సంభవించాయి. చైనాలో ఇప్పటి వరకు కరోనామరణాలు 3,245 సంభవించినట్లు ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చైనాలో 81 వేల ఇన్ఫెక్షన్లు బయపడ్డాయి. వారిలో 7,263 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల 8,700 మంది మరణించారు. దాదాపు 2 లక్షల మందికి వ్యాధి లక్షణాలు కనిపించాయి. 

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తొలిసారి ఈ నెల 10వ తేదీన వూహన్ నగరాన్ని సందర్శించి కరోనాను అదుపు చేయగలిగినట్లు తెలిపారు. వూహన్, హుబీ తప్ప మిగతా నగరాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.

click me!