జలపాతం దగ్గర స్టంట్‌కు ప్రయత్నించాడు.. నీటితోపాటే జారిపోయాడు.. భయానక వీడియో ఇదే

By Mahesh KFirst Published May 20, 2022, 6:48 PM IST
Highlights

జలపాతం దగ్గర స్టంట్ కు ప్రయత్నించాడు. జర్రున జారాడు. కొండ పై భాగం నుంచి పడుతున్న నీటితోపాటే ఆయన కూడా వేగంగా కిందకు వచ్చాడు. ఆయన స్నేహితులు ఒక్కసారిగా హతాశయులయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
 

న్యూఢిల్లీ: సాహసాలు, అభిరుచులు మన హద్దులను చెరిపేయాలని ప్రేరేపిస్తుంటాయి. ఈ ప్రయత్నాల్లో రక్షణ నిబంధనలు పట్టించుకోరు. ఫలితంగా వాటి చుట్టూ ఉన్న ముప్పును సరిగ్గా అంచనా వేయరు. అందుకే ప్రమాదాలు క్షణాల్లో ప్రాణాంతకంగా మారిపోతాయి. ఇలాంటి ఘటనే ఒకటి చైనాలో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

జియుజింగోలో అందమైన అటవీ ప్రాంతంలో ఓ జలపాతం ఉన్నది. కానీ, ఆ ప్రాంతం ప్రమాదకరమైనది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అసలు ఆ ప్రాంతంలోకి మనుషులు వెళ్లవద్దని హెచ్చరికల బోర్డులూ ఉన్నాయి. కానీ, వారు అవేమీ పట్టించుకోలేదు. అంతటితో ఆగలేదు. ఆ ప్రమాదకర ప్రాంతంలోనూ స్టంట్లు వేయాలని ప్రయత్నించారు. స్టంట్ కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తి దారుణంగా విఫలమయ్యాడు.

జలపాతం వేగంగా రెండు గుండ్ల మధ్య నుంచి పారుతున్నది. ఆ వ్యక్తి ఒక వైపు నుంచి మరో వైపుకు వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ, అది సాధ్యం కాలేదు. జలపాతం దగ్గరగా వెళ్లాడు. క్షణాల్లో ప్రమాదం జరిగింది. ఆయన ఎత్తైన కొండల్లో నుంచి జలపాతపు నీటితోపాటు కిందకు జారిపోయాడు.

This is why you should respect warning signs ⚠️ pic.twitter.com/MJM8Hvzps6

— South China Morning Post (@SCMPNews)

ఆయన స్నేహితులు చూస్తుండగా జర్రున జారి ఎత్తైన కొండ పై భాగం నుంచి కిందకు వేగంగా వచ్చాడు. అంతటితో ఆగలేదు. కొద్ది దూరం నీటితోపాటు, మరోచోటా గాల్లో కూడా ప్రయాణించాడు. వారి కళ్ల ముందు నుంచే పై నుంచి పడి కిందకు వెళ్లిపోయాడు. పూర్తిగా కింద పడిపోకుండా మధ్యలో రాళ్లల్లో చిక్కుకున్నాడు. అక్కడకు స్నేహితులు పరుగున వెళ్లారు.

ఈ వీడియోను సౌత్ చైనా మార్నింగ్ పోస్టు హ్యాండిల్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ప్రమాద సూచికలను గౌరవించాలని, ఇలాంటి ప్రమాదాలను అరికట్టాలని పేర్కొంది.

click me!