చైనాలో కలవరపెడుతున్న కరోనా ఉపరకం : ఒక్కరోజే 13 వేల కేసులు..రెండేళ్లలో తొలిసారి..

Published : Apr 04, 2022, 07:24 AM IST
చైనాలో కలవరపెడుతున్న కరోనా ఉపరకం  : ఒక్కరోజే 13 వేల కేసులు..రెండేళ్లలో తొలిసారి..

సారాంశం

చైనాలో కరోనా మళ్లీ కలవరపెడుతోంది. మరో కొత్త ఉపరకం వెలుగులోకి రావడంతో చైనా వణికిపోతోంది. దీని కారణంగా చైనాలో ఒక్కరోజే 13వేల కేసులు వెలుగుచూశాయి. రెండేళ్ల కాలంలో ఇలా ఒక్కరోజే ఇన్ని వేల కేసులు నమోదవ్వడం ఇది తొలిసారి. 

బీజింగ్ : Coronavirus మహమ్మారి విజృంభణతో China అల్లాడి పోతుంది.  నిత్యం రికార్డు స్థాయిలో positive cases నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 13 వేల కేసులు వెలుగు చూశాయి. రెండేళ్ళ కాలంలో ఇవే గరిష్ట కేసులుగా చైనా ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. కోవిడ్ కట్టడిలో భాగంగా ఇప్పటికే కోట్లమందిపై లాక్ డౌన్ ఆంక్షలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో కేసులు బయటపడడం చైనా అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే సమయంలో కొత్తగా కరోనా ఉపరకం వెలుగు చూడడం చైనా అధికారులను కలవరపెడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలు సడలిస్తున్నవేళ చైనాలో మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. శనివారం నాడు దేశవ్యాప్తంగా 12 వేల కేసులు నమోదు కాగా ఆదివారం ఒక్కరోజే 13,146 బయటపడ్డాయి,  వీటిలో 70 శాతం కేసులు షాంఘైలోనే ఉన్నాయి. అయితే, నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ మరణాలు మాత్రం సంభవించలేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఇలా నిత్యం వేల సంఖ్యలో కరోనా కేసులు బయట పడుతుండడంతో చైనా అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. తాజాగా ఈశాన్య చైనాలోని బయో చెంగ్ లోనూ లాక్డౌన్ విధించారు. హైనన్ ప్రావిన్స్ లోని సాన్యా నగరానికి వాహన రాకపోకలపై నిషేధం విధించారు. ఇప్పటికే రెండున్నర కోట్ల జనాభా కలిగిన షాంఘైలో భారీ స్థాయిలో నిర్ధారణ కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి.

ఉప రకం.. కలవరం ..
ఒమిక్రాన్ వేరియంట్ తో వణికిపోతున్న చైనాలో తాజాగా ఒమిక్రాన్ ఉపరకం వెలుగు చూసినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. షాంఘైకి సమీపంలోని కోవిడ్ బాధితుడిలో ఈ కొత్త రకాన్ని గుర్తించిన అధికారులు ఒమిక్రాన్ వేరియంట్ కు చెందిన బీఏ 1.1 నుంచి పరివర్తన చెందినట్లు అంచనా వేస్తున్నారు. అయితే,  చైనాలో కరోనాకు కారణమైన రకంతో ఇది సరిపోలడం లేదన్నారు. ఉత్తర చైనాలోని డాలియన్ నగరంలో నమోదైన కేసు స్థానిక వైరస్తో సరిపోలడం లేదని  అక్కడి మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. 

కొత్త వేరియంట్..
కాగా, రోజు రోజుకు తన రూపు మార్చుకుంటున్న కరోనా మహమ్మారి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటికే వెలుగుచూసిన అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్, దాని సబ్ ఒమిక్రాన్ వేరియంట్ బీఏఈల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి,  ఇప్పుడు క‌రోనా వైర‌స్ ఎక్స్ఈ వేరియంట్ (New Covid-19 mutant XE) వెలుగులోకి వచ్చింది, ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్, దాని స‌బ్ వేరియంట్ బీఏ.2 కంటే వేగంగా 10 శాతం అధికంగా వ్యాపిస్తోంది. ప్ర‌స్తుతం అమెరికా సహా ప‌లు యూర‌ప్ దేశాల్లో ఈ వేరియంట్ కార‌ణంగా క‌రోనా వైర‌స్ కొత్త కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. దీంతో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో తో పాటు అన్ని దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. 

New Covid-19 mutant XE అంటే..
కరోనా వైరస్ ఎక్స్ఈ వేరియంట్ ఒమిక్రాన్ కు చెందిన రెండు సబ్ వేరియంట్లు BA.1,  BA.2 ల ఉత్పరివర్తనం. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసులలో కొద్ది భాగానికి మాత్రమే కారణమవుతుందని ప్ర‌స్తుతం అంచ‌నాలు ఉన్నాయి. XE అనేది రీకాంబినెంట్ స్ట్రెయిన్ అని నిపుణులు చెబుతున్నారు. 
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే