కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేదు: చైనా పై మరోసారి ట్రంప్ విమర్శలు

By narsimha lodeFirst Published Jul 21, 2020, 6:02 PM IST
Highlights

చైనా తలుచుకొంటే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేదని.. కానీ  అలా చేయలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శించారు. కరోనా వైరస్ కారణంగా అమెరికా తీవ్రంగా నష్టపోయింది. 


వాషింగ్టన్: చైనా తలుచుకొంటే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేదని.. కానీ  అలా చేయలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శించారు. కరోనా వైరస్ కారణంగా అమెరికా తీవ్రంగా నష్టపోయింది. 

కరోనా విషయంలో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేదని డబ్ల్యు హెచ్ ఓ, చైనాపై ట్రంప్ ఒంటికాలిపై విమర్శలు చేశారు. తాజాగా మంగళవారం నాడు చైనాపై మరోసారి విమర్శలను ఎక్కుపెట్టారు. 

ఇది చైనా నుంచి వచ్చింది. వైరస్‌ బయటకు వ్యాపించకుండా వారు ఆపేయవచ్చు. కానీ అలా చేయలేదు. తమ దేశంలో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు. కానీ మిగతా ప్రపంచానికి వ్యాపించకుండా కట్టడి చేయలేకపోయారు. 

also read:తల్లికి కరోనా: తల్లడిల్లిన కొడుకు కిటికి వద్దే ఇలా...

కావాలనే ఇలా చేశారని ఆయన ఆరోపించారు.చైనా నుండి ఈ వైరస్ యూరప్ కు వ్యాపించిందన్నారు. ఆ తర్వాత అమెరికాకు వ్యాపించిందని ఆయన తెలిపారు.చైనా ఎప్పుడూ తమకు వ్యతిరేకమేనని చెప్పారు. ఆ దేశం కరోనా విషయంలో ఏనాడూ కూడ పారదర్శకంగా లేదన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. 

also read:అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ గుడ్‌న్యూస్: కరోనా రోగుల్లో ఇమ్యూనిటీ పవర్ పెరిగింది

ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. సుమారు 4 మిలియన్ల మంది అమెరికన్లే ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 6 లక్షలు ఉండగా వీటిలో అత్యధికంగా అమెరికాలో 1,43,000 మరణాలు చోటు చేసుకున్నాయి.

కరోనా విషయంలో పలు దేశాల అధ్యక్షులతో ట్రంప్ ఫోన్లో చర్చిస్తున్నారు. సోమవారం నాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్జేల్ ఫట్జా ఆల్ సిసితో ఆయన మాట్లాడారు. 

కరోనాతో ప్రపంచం వణికిపోతోందని ఆయన చెప్పారు. కరోనా ఆకస్మాత్తుగా వచ్చి పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కరోనా విషయంలో అనేక దేశాలకు తాము సహాయం చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వెంటిలేటర్లను ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్‌లు, చికిత్స విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు తాము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

click me!