ప్రపంచవ్యాప్తంగా 19లక్షలు దాటిన కేసులు.. లక్షా19వేల మరణాలు

By telugu news team  |  First Published Apr 14, 2020, 9:07 AM IST
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 19 లక్షల 23 వేలకు చేరుకున్నాయి. కరోనా వైరస్‌ బారిన పడి 1 లక్ష 19వేల 587 మంది మృత్యువాత పడ్డారు. 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృత్యు ఘోష వినిపిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకేసింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 19 లక్షల 23 వేలకు చేరుకున్నాయి. కరోనా వైరస్‌ బారిన పడి 1 లక్ష 19వేల 587 మంది మృత్యువాత పడ్డారు. 

వైరస్‌ బారి నుంచి 4 లక్షల 43 వేల మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. అమెరికాలో 5.86 లక్షలకు పైగా కరోనా బారిన పడగా,  23,610 మంది మరణించారు. స్పెయిల్‌లో కేసుల సంఖ్య 1.70కు చేరుకోగా, 17,756 మంది కరోనా కాటుకు బలయ్యారు. 

ఇటలీలో 1.59 లక్షల మంది కరోనా పాజిటివ్‌ రాగా, 20,465 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో 1.36 మందికి కోవిడ్‌ 19 పాజిటివ్‌ రాగా, 14,967 మంది మృత్యువాత పడ్డారు. 

ఇక భారత్ లోనూ పదివేలకు చేరువలో కరోనా కేసులు చేరుకున్నాయి. మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదు కావడం గమనార్హం.  ఇదిలా ఉండగా... ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 30శాతం కేసులు కేవలం అమెరికాలోనే నమోదు అయ్యాయి. ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కాగా.. ఇప్పటి వరకు కనీసం ఈ వైరస్ కి మందు కనుగొనలేకపోయారు. వ్యాక్సిన్ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ.. ఇప్పటి వరకు అయితే కచ్చితంగా ఇది మందు అని మాత్రం అని చెప్పలేకపోతున్నారు. కాగా.. మలేరియాకి వాడే మందులను ప్రస్తుతం కరోనా రోగులకు అందజేస్తున్నారు.
click me!