భర్తను ఎలా హత్య చేయాలి..? నవలా రచయిత్రి అరెస్ట్

First Published 12, Sep 2018, 4:44 PM IST
Highlights

నాన్సీ ‘హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్’ పేరిట ఒక వ్యాసాన్ని రాశారు. రొమాంటిక్ రైటర్‌గా పేరొందిన నాన్సీ పలు పుస్తకాలు కూడా రాశారు

ఓ రచయిత్రి.. తన కళా హృదాయాన్ని అంతా రంగరించి.. ‘‘భర్తను ఎలా హత్య చేయాలి’’ అనే నవల రాసింది. ఇప్పుడు అదే ఆమె చావు మీదకి వచ్చింది. ఆమె భర్తను ఆమె చంపిందనే అనుమానంతో.. పోలీసులు ఆ రచయిత్రిని అరెస్టు చేసి జైల్లో వేశారు.

ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అసలు మ్యాటరేంటంటే...రొమాంటిక్ వ్యాసాలు రచించే అమెరికాకు చెందిన ఒక మహిళ... తన భర్తను హత్య చేసిందనే ఆరోపణల మీదట గత వారం పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని ఆరెగాన్‌కు చెందిన 68 ఏళ్ల రచయిత్రి నాన్సీ క్రాంప్టన్ బ్రాఫీ హత్యారోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆమె భర్త హత్యకు గురయ్యారు. 

ఈ సందర్భంగా నాన్సీ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో సంతాపాన్ని వెలిబుచ్చారు. కాగా గతంలో నాన్సీ ‘హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్’ పేరిట ఒక వ్యాసాన్ని రాశారు. రొమాంటిక్ రైటర్‌గా పేరొందిన నాన్సీ పలు పుస్తకాలు కూడా రాశారు. గతంలో ఆమె ‘రొమాంటిక్ సస్పెన్స్ రైటర్‌గా తాను హత్య... తదనంతర పరిణామాలు, పోలీసుల జోక్యం తదితర అంశాలపై ఎంతగానో ఆలోచించానని’ ఒక వ్యాసంలో రాశారు.

Last Updated 19, Sep 2018, 9:24 AM IST