కుల్‌సుమ్ ఒక్కసారి కళ్లు తెరిచి చూడు: భార్యతో నవాజ్ చివరి మాటలు

Published : Sep 12, 2018, 04:02 PM ISTUpdated : Sep 19, 2018, 09:24 AM IST
కుల్‌సుమ్  ఒక్కసారి కళ్లు తెరిచి చూడు: భార్యతో నవాజ్ చివరి మాటలు

సారాంశం

 పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్ సతీమణి కుల్‌సుమ్ నవాజ్‌తో ఆయన గడిపిన చివరిక్షనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్‌గా మారాయి.  కుల్‌సుమ్ ఒక్కసారి కళ్లు తెరిచి నన్ను చూడూ ..

లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్ సతీమణి కుల్‌సుమ్ నవాజ్‌తో ఆయన గడిపిన చివరిక్షనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్‌గా మారాయి.  కుల్‌సుమ్ ఒక్కసారి కళ్లు తెరిచి నన్ను చూడూ .. ఆ అల్లా నీకు శక్తిని ప్రసాదించాలని  ఆయన ఉర్ధూలో మాట్లాడిన  మాటలు భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సతీమణి కుల్‌సుమ్‌ నవాజ్‌ (68) కన్నుమూసిన విషయం తెలిసిందే. దీర్ఘకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె లండన్‌లో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 

ఈ ఏడాది జూలైలో అక్రమ ఆస్తుల కేసులో ఆయనపై 11 ఏళ్ల శిక్ష పడింది. దీంతో లండన్ నుంచి బయలుదేరుతున్న సమయంలో నవాజ్‌ షరీఫ్‌ తన సతీమణితో చివరిసారిగా మాట్లాడారు. 

అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నవాజ్‌కు 12 గంటల పెరోల్ లభించింది. అక్రమాస్తుల కేసులో శిక్షను అనుభవిస్తున్న నవాజ్‌ భార్య మరణం విషయం తెలిసి పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు అనుమతినిచ్చింది. 

రావల్పిండిలోని అదియాల జైలులో నవాజ్‌తో పాటు శిక్షను అనుభవిస్తున్న ఆయన కుమార్తె మర్యం నవాజ్‌, అల్లుడు సప్ధర్‌లకు కూడా పెరోల్‌ లభించింది. అక్కడి నుంచి వీరిని అంత్యక్రియల జరిగే జతి ఉమ్రాకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. 

 కుల్‌సుమ్‌ మరణవార్తతో పాకిస్తాన్‌లోని నవాజ్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతదేహాన్ని సైతం లండన్‌ నుంచి ప్రత్యేక విమానంలో పాకిస్తాన్‌కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

Fake Doctors : పాకిస్థాన్ మొత్తం శంకర్ దాదా ఎంబిబిఎస్ లే.. ఎంతమంది నకిలీ డాక్టర్లున్నారో తెలుసా?
భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ వదులుకున్న భర్త.. కోర్టు ఆసక్తికర తీర్పు