పని ప్రదేశాల్లో పురుషులను ‘బట్టతల’ అని పిలవడం లైంగిక వేధింపే.. ఇంగ్లండ్ ట్రైబ్యునల్ తీర్పు...

By SumaBala BukkaFirst Published May 14, 2022, 7:13 AM IST
Highlights

పని ప్రదేశాల్లో పురుషులను బట్టతల అని పిలవడం లైంగిక వేధింపుల కిందికే వస్తుందని ఇంగ్లండ్ లోని ట్రైబ్యునల్ తీర్పు నిచ్చింది. ఈ మేరకు నష్టపరిహారం కూడా చెల్లించాలని తేల్చింది. 

లండన్ : పనిచేసేచోట ఏ పురుషుడినైనా bald hair పేరుతో సంబోధిస్తే అది ఖచ్చితంగా లైంగిక వేధింపుల కిందకే వస్తుందని ఇంగ్లండ్ కు చెందిన ఓ ట్రైబ్సునల్ శుక్రవారం స్పష్టం చేసింది. వెస్ట్ యోర్క్ షైర్ కేంద్రంగా పనిచేసే బ్రిటిష్ బంగ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ పై… ఆ సంస్థ మాజీ ఉద్యోగి టోనీ ఫిన్ దావా వేశాడు. 24 ఏళ్లపాటు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ వచ్చానని, సంస్థకు చెందిన సూపర్వైజర్ తనను harassmentకు గురి చేశాడు అని పేర్కొన్నాడు. తనను వివక్షకు గురి చేసి అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని కూడా పిటిషన్లో వివరించారు. దీంతో తలపై జుట్టు తక్కువగా ఉందన్న కారణంగా కార్యాలయాల్లో పనిచేసే పురుషులను ‘బట్టతల’ పేరుతో పిలవడం అవమానించడమా?  లైంగికంగా వేధించడమా?  అన్న అంశంపై షెఫీల్డ్ కి చెందిన ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్లో ఈ ఏడాది ఫిబ్రవరి ఏప్రిల్ నెలలో వాదోపవాదాలు జరిగాయి. 

న్యాయమూర్తి జోనాథన్  బ్రెయిన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది.  కంపెనీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ…  బట్టతల స్త్రీ,  పురుషుల్లో  ఎవరికైనా ఉండవచ్చని పేర్కొన్నారు.  ట్రైబ్యునల్ ఈ వాదనతో ఏకీభవిస్తూనే.. మహిళలతో పోలిస్తే పురుషులనే ఎక్కువగా ఈ సమస్య వేధిస్తున్నందున, దీన్ని లైంగిక వేధింపులుగా పరిగణించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ‘బట్టతల’ అని పిలవడం వల్ల వ్యక్తుల గౌరవం దెబ్బతింటుందని, ఇది వారిని భయాందోళనకు గురిచేసే పని అభిప్రాయపడింది. బాధితుడిని వేధింపులకు గురిచేసి, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు… సదరు కంపెనీ  నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ మొత్తాన్ని త్వరలోనే నిర్ణయిస్తామంటూ విచారణను వాయిదా వేసింది. 

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 17న కోల్ కతా హైకోర్టు మైన‌ర్ బాలిక‌ల లైంగిక వేధింపుల విష‌యంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. లైంగిక ఉద్దేశంతో బాధితురాలి ఛాతీని లేదా నిర్థిష్ట భాగాల‌ను తాకితే.. అది లైంగిక వేధింపుల కింద‌కు వ‌స్తుంద‌ని కోల్‌క‌తా హైకోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలి శరీరంలో ఛాతి అభివృద్ధి చెందిందా..? లేదా..? అనేది అప్రస్తుతమని, నిందితుడు దురుద్దేశంతో తాకితే లైంగిక వేధింపులుగా ప‌రిగ‌ణించాల‌ని స్ప‌ష్టం చేసింది. 2017లో నమోదైన ఓ కేసుకు సంబంధించి కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 448ల ప్రకారం నిందితుడు దోషి అని నిర్థారించించింది. 

2017లో నమోదైన కేసు ప్రకారం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రోహిత్ పాల్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఓ బాలిక(13)ను లైంగికంగా వేధించాడు. ఇంట్లో ఆడుకుంటున్న బాలికను దగ్గరకు లాక్కున్నాడు. ఆమె ఛాతితో పాటు ఇతర శరీర భాగాలను తాకుతూ, ఆమె ముఖం మీద ముద్దులు పెట్టాడు. దీంతో ఆ బాలిక గట్టిగా అరవడంతో ఆ నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తరువాత బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 448ల ప్రకారం నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది.

click me!