భర్త చితాభస్మాన్ని ఐస్ క్రీం తిన్నట్టు తింటూ..ఎక్కడికెళ్లినా తీసుకెడుతూ.. ఓ భార్య వింత ప్రేమ...

By AN TeluguFirst Published Oct 22, 2021, 7:36 AM IST
Highlights

జీవితకాలం తోడుంటానన్న భాగస్వామి అకస్మాత్తుగా అనారోగ్యంతో దూరం కావడంతో తట్టుకోలేకపోయిన ఆ భార్య... ఓ వితం అలవాటుకు బానిస అయ్యింది. అంతేకాదు అదే తనను ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచుతుందంటూ చెబుతోంది. 

యూకె : మనకు ఇష్టమైన వారు జీవిత భాగస్వామి ఇలా ఎవరైనా మన నుంచి శాశ్వతంగా దూరమైతే ఆ బాధ భరించలేనిది!  ఈ క్రమంలో కొందరు మరణించిన వారి జ్ఞాపకాలకు గుర్తుగా స్మారకాలు నిర్మించడమో,  వారి విగ్రహాలు తయారు చేయించి పూజించడం చేస్తుంటారు.  కానీ.. యుకెకు చెందిన ఓ 26 ఏళ్ల మహిళ మాత్రం అసాధారణంగా ప్రవర్తిస్తున్నారు.

పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి.. అన్నట్టుగా.. మనసుకో ఇష్టం అనికూడా అనుకోవాలి. మనసనేది ఓ వింత వ్యసనాల నిలయం. అదేమనుకుంటే అదే మనతో చేయిస్తుంది. 

దీంతో నలుగురిలో విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ప్రవర్తించేవారికి అది మామూలుగానే, ఇష్టంగానే ఉండొచ్చు. కానీ చూసేవారికి ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి కొన్ని వింత, విచిత్రమైన అలవాటే ఇది కూడా. 

జీవితకాలం తోడుంటానన్న భాగస్వామి అకస్మాత్తుగా అనారోగ్యంతో దూరం కావడంతో తట్టుకోలేకపోయిన ఆ భార్య... ఓ వితం అలవాటుకు బానిస అయ్యింది. అంతేకాదు అదే తనను ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచుతుందంటూ చెబుతోంది. దీనికి కారణం కూడా తిరిగి మనసుకు సంబంధించిన విషయాలే. 

ఓ భార్య చనిపోయిన తన భర్త Ashesని వెంట పెట్టుకుని తిరుగుతోంది. అంతటితో ఆగకుండా అప్పుడప్పుడు దాన్ని తింటూ ఉండడం గమనార్హం.

పాకిస్తాన్ లాహోర్ ఫ్యాక్టరీలో పేలుడు: ఇద్దరు మృతి

తోటి వారు  షాక్!
ukకు చెందిన కాసీకి,  సీన్ కు  2009లో పెళ్లయింది. అన్యోన్యంగా ఉంటున్న ఈ జంటను విధి వెక్కిరించింది.  కొన్నాళ్ల క్రితం  Asthma బారిన పడిన  సీన్ కన్నుమూశాడు.  భర్త అంత్యక్రియలు నిర్వహించిన కాసీ..  అప్పటి నుంచి అతని చితా భస్మాన్ని తనతోపాటు ప్రతి చోటికి తీసుకు వెళ్లడం ప్రారంభించింది.

షాపింగ్ కు, సినిమాకు, హోటళ్లకు ఇలా ఎక్కడికి వెళ్ళినా చితాభస్మం వెంట ఉండాల్సిందే. అయితే ఇదంతా సాధారణమేనని భావించే తోటివారు.. ఆమె ఆ చితాభస్మాన్ని కొద్ది కొద్దిగా Eating చేస్తుండడంచూసి షాక్ కు గురవుతున్నారు.  ఈ విషయాన్ని ఆమె  సైతం అంగీకరించారు.

‘ తింటున్న కొద్ది ఉత్సాహం’
‘ నా భర్త నుంచి దూరం కావాలనుకోవడం లేదు. కాబట్టే ఇలా చేస్తున్నాను. రెండు నెలలు అవుతున్నా దీన్ని మానుకోలేక పోతున్నా’ అని ఆమె పేర్కొంది.  మొదట్లో  చితాభస్మం వాసన  కుళ్లిన గుడ్ల మాదిరి వచ్చేదని,  ఇప్పుడు అలవాటు అయిపోయింది అని చెబుతుండడం గమనార్హం. 

‘‘చితాభస్మం వచ్చినప్పుడల్లా ఆనందం కలుగుతుందని, దాన్ని తింటున్న కొద్ది మరింత ఉత్సాహం కలుగుతుందని ఆమె వివరిస్తున్నారు. ఆమె ఈ Habitను స్థానికంగా ‘ప్రజల వింత వ్యసనాలపై’ రూపొందించిన ఒక కార్యక్రమంలోనూ ప్రదర్శించారు.

click me!