భారత్ తో కెనడా యుద్ధం చేయడమంటే.. ఏనుగుతో చీమ పోరాడిన్నట్టే.. - పెంటగాన్ మాజీ అధికారి

By Asianet News  |  First Published Sep 23, 2023, 11:52 AM IST

తమకు కెనడా కంటే భారత్ చాలా ముఖ్యమైనదని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. రెండు దేశాల్లో ఏదో ఒక దానిని ఎంచుకోవాల్సి వస్తే అమెరికా భారత్ ను ఎంచుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. కెనడా భారత్ తో పోరాడకపోవడమే ఉత్తమం అని ఆయన అభిప్రాయపడ్డారు.


కొంత కాలం నుంచి భారత్ పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిణామంపై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ స్పందించారు. ట్రూడో ఆరోపణలు భారత్ కంటే కెనడాకే ఎక్కువ ప్రమాదకరమని అన్నారు. ఒక వేళ అమెరికా.. ఒట్టావా (కెనడా రాజధాని) న్యూఢిల్లీలలో ఏదో ఒక దానిని ఎంచుకోవాల్సి వస్తే.. యూఎస్ ఖచ్చితంగా భారత్ ను ఎంపిక చేసుకుంటుందని అన్నారు. ఎందుకంటే తమ దేశానికి భారత్ సంబంధాలు చాలా ముఖ్యమైనవని అన్నారు. 

కెనడా కంటే వ్యూహాత్మకంగా భారత్ చాలా ముఖ్యమైనదని  మైఖేల్ రూబిన్ స్పష్టం చేశారు. ఒక వేళ కెనడా భారత్ తో యుద్ధం చేయడం అంటే ఏనుగుతో చీమ పోరాడటమే అవుతుందని అన్నారు. జస్టిన్ ట్రూడో పేలవమైన ఆమోద రేటింగ్ లను ప్రస్తావిస్తూ.. రూబిన్  ప్రధానిగా ఎక్కువ కాలం కొనసాగలేడని, ఆయన పోయిన తరువాత అమెరికా సంబంధాలను పునర్నిర్మించగలదని అన్నారు. 

Latest Videos

‘‘ప్రధాని ట్రూడో పెద్ద తప్పు చేశారని నేను అనుకుంటున్నాను. ఆయన వెనక్కి తగ్గని విధంగా ఆరోపణలు చేశారు. ఆయన నడుము నుంచి కాల్పులు జరుపుతున్నారు. ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం ఒక ఉగ్రవాదికి ఎందుకు ఆశ్రయం కల్పిస్తోందో ఆయన వివరించాలి’’ అని ఆయన అన్నారు. ‘‘ఇద్దరు స్నేహితుల్లో ఒకరిని అమెరికా ఎంచుకోవాల్సి వస్తే.. ఈ విషయంలో మేము భారతదేశాన్ని ఎంచుకోబోతున్నాం. ఎందుకంటే నిజ్జర్ ఉగ్రవాది. భారతదేశం చాలా ముఖ్యమైనది. మా బంధం చాలా ముఖ్యం’’ అని మైఖేల్ రూబిన్ తెలిపాడు.

ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై అమెరికా బహిరంగంగా జోక్యం చేసుకుంటుందా అన్న ప్రశ్నకు రూబిన్ సమాధానమిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే భారత్ కంటే కెనడాకే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. కెనడా పోరాటాన్ని ఎంచుకోవాలనుకుంటే, ఇది చీమ ఏనుగుతో పోరాడటానికి ఎంచుకున్నట్టే అవుతుంది. వాస్తవం ఏమిటంటే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ముఖ్యంగా హిందూ మహాసముద్ర పరీవాహక ప్రాంతంలో, పసిఫిక్ ప్రాంతంలో చైనా, ఇతర విషయాలకు సంబంధించి ఆందోళన పెరుగుతున్నందున, కెనడా కంటే వ్యూహాత్మకంగా ఇది చాలా ముఖ్యమైనది.’’ అని ఆయన అన్నారు.

click me!