'భారత్ లో పర్యటించే వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి' : ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన కెనడా

By Rajesh Karampoori  |  First Published Sep 20, 2023, 5:51 AM IST

భారత్, కెనడా మధ్య సంబంధాలు క్షీణిస్తున్న వేళ కెనడా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. కెనడా ప్రభుత్వం తన పౌరులకు ప్రయాణ సలహాను జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లకుండా ఉండాలని కెనడా ప్రభుత్వం తన పౌరులను ఆదేశించింది.  


భారత్, కెనడా మధ్య వివాదం క్రమంగా ముదురుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ఆరోపణలు చేయడంతో ఇరుదేశాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని మన రాయబారిపై వేటు వేయడంతో .. దానికి ప్రతికారంగా భారత్ ఆ దేశ రాయబారిని బహిష్కరించింది. తాజాగా కెనడా మరో వివాదాస్పద అంశాన్ని ప్రస్తవించింది. మన దేశంలో ప్రయాణిస్తున్న కెనడా పౌరులను  హెచ్చరించింది. 

కెనడా ప్రభుత్వం తన పౌరులకు ప్రయాణ సలహాను జారీ చేసింది. భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లకుండా ఉండాలని కెనడా ప్రభుత్వం తన పౌరులను ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా కెనడియన్ పౌరులు జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లకూడదని ప్రయాణ సలహా పేర్కొంది.

Latest Videos

అలాగే.. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్‌ ల్లో పర్యటించకూడదని ఆ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.  పాకిస్థాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదనీ,ఇది కాకుండా.. పంజాబ్, రాజస్థాన్ , గుజరాత్‌లతో సహా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన సూచనలను కూడా జారీ చేసింది. 

ఈ ట్రావెల్ అడ్వైజరీలో భద్రతా కారణాలను ఉదహరించింది. ఉగ్రవాదం, తీవ్రవాదం, అశాంతి, కిడ్నాప్‌ల ముప్పు ఉందని, ఆ ప్రాంతం ప్రయాణించకపోవడమే సురక్షితమని పేర్కొంది. అక్కడ పరిస్థితులు వెనువెంటనే మారవచ్చనీ,  ఆ ప్రాంతంలో ప్రయాణించేటప్పుడూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కెనడా ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌కు సంబంధించి ఎటువంటి సూచనలు జారీ చేయకపోవడం గమనార్హం.

వివాదం ఏమిటి?

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా పార్లమెంటులో ఆ దేశ ప్రధాని పేర్కొన్నారు. దీనితో పాటు కెనడా కూడా భారతదేశ దౌత్యవేత్తను తొలగించింది. ఆ తర్వాత భారత్ వైపు నుంచి కూడా చర్యలు తీసుకున్నారు.

click me!