మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి: డబ్ల్యుహెచ్ఓ

By narsimha lodeFirst Published Nov 6, 2020, 1:35 PM IST
Highlights

సొల్యూషన్స్, సొలిడారిటీ, సైన్స్ అనే మూడు ఆయుధాలతో కరోనాను ఓడించగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వర్చువల్ సెషన్ లో భాగంగా మూడు ముఖ్యమైన విషయాలను వెల్లడించింది.

జెనీవా:సొల్యూషన్స్, సొలిడారిటీ, సైన్స్ అనే మూడు ఆయుధాలతో కరోనాను ఓడించగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వర్చువల్ సెషన్ లో భాగంగా మూడు ముఖ్యమైన విషయాలను వెల్లడించింది.

మొదటిసారి ప్రపంచం అన్ని దేశాలకు అవసరమైన వ్యాక్సిన్, డయాగ్నస్టిక్స్, చికిత్సా విధానాలను అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రణాళికతో ముందుకు కదలింది.యాక్సెస్ టూ కోవిడ్ -19 టూల్స్ యాక్సిలేటర్  నిజమైణ పలితాలను అందిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని డబ్ల్యుహెచ్ఓ కోరింది. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ కోవిడ్ -19 వంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల కు అనుకూలంగా బలమైన ముసాయిదా తీర్మానాన్ని పరిశీలిస్తున్నట్టుగా డబ్ల్యుహెచ్ఓ తెలిపింది.

కరోనా వంటి ప్రమాదకరమైన అంటు వ్యాధుల కేసులను గుర్తించడానికి ప్రతిస్పందించడానికి అన్ని దేశాలు మెరుగ్గా ఉన్నాయని నిర్ధారించడానికి ఉపయోగపడుతోందని డబ్ల్యుహెచ్ఓ అభిప్రాయపడింది.

కోవిడ్ మహమ్మారి వల్ల దేశాల ఆర్ధిక, సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థిరత్వానికి ఆరోగ్యం అనేది ఎంతటి బలమైన పునాదో తెలిసివచ్చిందన్నారు.ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 47 మిలియన్లకు చేరుకొన్నాయి. ఈ వైరస్ తో ఇప్పటికే ప్రపంచంలో 1.2 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు.

click me!