డోనాల్డ్ ట్రంప్‌నకు టీవీ చానెల్స్ షాక్:స్పీచ్ లైవ్ కట్

Published : Nov 06, 2020, 10:37 AM IST
డోనాల్డ్ ట్రంప్‌నకు టీవీ చానెల్స్ షాక్:స్పీచ్ లైవ్ కట్

సారాంశం

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికాలోని పలు టీవీ ఛానెల్స్ షాకిచ్చాయి. ఎన్నికలు జరిగిన రాత్రి నుండి ట్రంప్ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారనే నెపంతో గురువారం నాడు ప్రజలతో బహిరంగ ప్రదర్శన ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేశాయి.

వాషింగ్టన్:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికాలోని పలు టీవీ ఛానెల్స్ షాకిచ్చాయి. ఎన్నికలు జరిగిన రాత్రి నుండి ట్రంప్ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారనే నెపంతో గురువారం నాడు ప్రజలతో బహిరంగ ప్రదర్శన ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేశాయి.

also read:అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: చరిత్ర సృష్టించిన రిచీ టోరెన్

ట్రంప్ 17 నిమిషాల ప్రసంగంలోో ఆధారాలు లేని తప్పుడు ప్రచారం చేశారు. డెమోక్రట్లు తమ నుండి ఎన్నికలను దొంగిలించడానికి  అక్రమ ఓట్లను ఉపయోగిస్తున్నారని  ఆరోపించారు.

ఈ ప్రసంగాన్ని చూసిన టీవీ ఛానెల్స్ నెట్ వర్క్ లు తమ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేశాయి. అమెరికా అధ్యక్షుడికి అంతరాయం కల్గించడమే కాకుండా ఆయనను సరిదిద్దే అసాధారణ స్థితిలో ఉన్నామని ఎంఎస్‌ఎన్‌బీసీ యాంకర్ బ్రియాన్ విలియమ్స్ చెప్పారు. ఆ ఛానెల్ ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని త్వరగా ముగించింది.

ఎన్బీసీ, ఏబీసీ ఛానెల్స్ కూడ ట్రంప్ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేశాయి.ఎన్నికలను దొంగిలించడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన మాట వినడానికి విచారకరమైందని సీఎన్ఎన్ జేక్ టాప్పర్ చెప్పారు.

ఎన్నికలు దొంగిలించినట్టుగా అబద్దం తర్వాత, అబద్దాన్ని ఎటువంటి ఆధారాలు లేకుండా ట్రంప్ ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే