బస్సు-ఆయిల్ ట్యాంకర్ ఢీ.. 20 మంది స‌జీవ‌ద‌హ‌నం

By Mahesh RajamoniFirst Published Aug 16, 2022, 12:58 PM IST
Highlights

Bus-oil tanker crash: బస్సు-ఆయిల్ ట్యాంకర్ ఢీ కొన్న‌ ప్రమాదంలో 20 మంది స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యార‌నీ, గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో.. డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి మిగిలిన శ‌రీర భాగాల‌ను వారి బంధువుల‌కు అప్ప‌గిస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. 
 

Pakistan road accident: బస్సు-ఆయిల్ ట్యాంకర్ ఢీ కొన్న‌ ప్రమాదంలో 20 మంది మరణించారు. ఈ ఘోర ఘ‌ట‌న పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. 20 మంది స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యార‌నీ, డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి మిగిలిన శ‌రీర భాగాల‌ను వారి బంధువుల‌కు అప్ప‌గిస్తున్నామ‌ని అధికారులు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పాకిస్థాన్ మీడియా పేర్కొన్న వివ‌రాలు ఇలా ఉన్నాయి.. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో బస్సు-ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో 20 మంది మరణించారు. మూడు రోజుల్లో ప్రావిన్స్‌లో జరిగిన రెండవ పెద్ద రోడ్డు ప్రమాదం ముల్తాన్‌లోని మోటర్‌వేపై అతివేగం కారణంగా సంభవించిందని పోలీసులు తెలిపారు. మంగళవారం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రయాణీకుల బస్సు, చమురు ట్యాంకర్ ఢీ కొన్నాయ‌నీ, ఈ ప్రమాదంలో కనీసం 20 మంది సజీవ దహనమయ్యార‌ని అధికారులు తెలిపారు. 

లాహోర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్తాన్‌లోని మోటర్‌వేపై ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత కొన్ని గంటలపాటు మోటర్‌వేపై ట్రాఫిక్ నిలిచిపోయింది.  "లాహోర్ నుండి కరాచీకి వెళ్తున్న బస్సు, ఎదురుగా  వ‌స్తున్న ఆయిల్ ట్యాంకర్ రెండు ఢీకొన్న ప్రమాదంలో 20 మంది మరణించారు. ఢీకొన్న తర్వాత, బస్సు-ట్యాంకర్ రెండింటిని మంటలు  చుట్టుముట్టాయి. దీంతో బ‌స్సుతో పాటు ఆయ‌ల్ ట్యాంక‌ర్ లో ఉన్న ప‌లువురు స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు" అని తెలిపారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ముల్తాన్‌లోని నిష్టర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారి పరిస్థితి విషమంగానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. 

"చనిపోయిన ప్రయాణీకులలో చాలా మంది మృతదేహాలు పూర్తిగా.. గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ మృతదేహాలను DNA పరీక్ష తర్వాత కుటుంబాలకు అప్పగిస్తాము" అని అధికారులు తెలిపారు. 
 

click me!