King Charles III: బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్(75) III క్యాన్సర్ బారినపడ్డారని సోమవారం రాత్రి వెల్లడించింది. చార్లెస్‌కు ఇప్పటికే చికిత్స మొదలైందని తెలిపింది
King Charles III: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III సంబంధించిన ఓ కీలక వార్త వెలుగులోకి వచ్చింది. కింగ్ చార్లెస్(75) III క్యాన్సర్ తో బాధపడుతున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ సోమవారం (ఫిబ్రవరి 5) ప్రకటించింది. ABC న్యూస్ ప్రకారం.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కింగ్ చార్లెస్ III పరీక్షలు నిర్వహించగా.. ఆ వైద్య పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కి క్యాన్సర్ ఉందన్న వార్తతో అతని మద్దతుదారులు బాధపడ్డారు. రాజుకు సంబంధించిన అన్ని పబ్లిక్ ఫంక్షన్లను రద్దు చేయాలని వైద్యులు సూచించారు. అయితే, కింగ్ చార్లెస్ ఏ రకమైన క్యాన్సర్‌తో బాధపడుతున్నారో స్పష్టంగా తెలియలేదు.
బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటన ప్రకారం.. , కింగ్ చార్లెస్ III కి క్యాన్సర్ నిర్ధారణ తర్వాత హర్ మెజెస్టి సాధారణ చికిత్స కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సమయంలో వైద్యులు బహిరంగంగా జరిగే అన్ని పనులను వాయిదా వేయాలని సూచించారు. ఈ వ్యవధిలో అతని మెజెస్టి యథావిధిగా రాష్ట్ర వ్యవహారాలు, అధికారికారాలను నిర్వహిస్తుంది. కింగ్ చార్లెస్ III తన చికిత్స పట్ల పూర్తిగా సానుకూలంగా ఉన్నారనీ, వీలైనంత త్వరగా పూర్తి ఆరోగ్యంతో ప్రజా కార్యకలాపాలకు తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నారని తెలిపారు.
కింగ్ చార్లెస్ III క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే వార్త విన్న బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కింగ్ త్వరలో కోలుకుంటాడని రిషి సునక్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేశం మొత్తం కోరుకుంటోందని పేర్కొన్నారు. కింగ్ చార్లెస్ వయస్సు 75 సంవత్సరాలు. ఈ వయసులో ఆయన క్యాన్సర్‌తో బాధపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కింగ్ చార్లెస్ ఆరోగ్యంపై రాజకుటుంబం ఆందోళన చెందుతోంది. క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత బ్రిటన్ సామ్రాజ్యానికి 40వ చక్రవర్తిగా చార్లెస్-3 పేరుతో చార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్ లాంఛనంగా పట్టాభిషిక్తుడయ్యారు.