ఎవ‌రీ రిషి సున‌క్‌? బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో భార‌త సంత‌తి వ్య‌క్తి..

Published : Jul 08, 2022, 10:25 AM IST
ఎవ‌రీ రిషి సున‌క్‌? బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో భార‌త సంత‌తి వ్య‌క్తి..

సారాంశం

British PM: ప‌లు ఆరోప‌ణ‌ల కార‌ణంగా బోరిస్ జాన్స‌న్  రాజీనామా చేసిన త‌ర్వాత‌.. బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో భార‌త సంత‌తి వ్య‌క్తి రిషి సున‌క్ పేరు వినిపిస్తోంది. కరోనా సమయంలో బ్రిట‌న్ ఆర్థిక మంత్రిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

Rishi Sunak: క‌రోనా స‌మ‌యంలో మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఉల్లంఘిస్తూ పార్టీలు, ముడుపులు అందుకోవడం, సెక్స్ కుంభ‌కోణ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌ద‌వికి బోరిస్ జాన్స‌న్ రాజీనామా చేశారు. అయితే, కొత్త ప్ర‌ధాని రేసులో భార‌త సంత‌తి వ్యక్తి రిషి సున‌క్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆర్థిక మంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న క‌రోనా స‌మ‌యంలో ఉద్యోగులు, ప్ర‌జ‌ల కోసం ఎన్నో మెరుగైన ప‌థ‌కాలు తీసుకువ‌చ్చారు. ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచారు. దీంతో ఆయ‌న‌కు మంచి గుర్తింపు ల‌భించింది. త‌దుప‌రి బ్రిటిష్ ప్ర‌ధాన మంత్రిగా బోరిస్ జాన్స‌న్ స్థానంలో రిషి స‌న‌క్ నిల‌వ‌బోతున్నార‌ని  అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. 42 ఏళ్ల రిషి సునక్ మొదటి భారత సంతతి UK ప్రధానమంత్రి కావచ్చు అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే గ‌న‌క జ‌రిగితే మరో కొత్త చ‌రిత్ర కానుంది. బ్రిట‌న్ ప్ర‌ధాని గా మొద‌టి భార‌తీయ సంత‌తి వ్య‌క్తిగా చ‌రిత్ర సృష్టించ‌నున్నారు. 

ఎవ‌రీ రిషి సున‌క్‌? 

రిషి సున‌క్ పూర్వీకులు పంజాబ్ కు చెందిన వారు. ఆయ‌న త‌ల్లిదండ్రులు ఇద్ద‌రు బ్రిట‌న్ ఆరోగ్య రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న త‌ల్లి ఫార్మసిస్ట్, ఆయ‌న తండ్రి నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) జనరల్ ప్రాక్టీషనర్ (GP) గుర్తింపు తెచ్చుకున్నారు.  రిషి సున‌క్ వీరిద్ద‌రికి బ్రిట‌న్ లోనే జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ విద్య‌ను పూర్తి చేశారు. ఇన్ఫోసిస్ స‌హా వ్య‌వ‌స్థాప‌కులు ఎన్ఆర్ నారాయ‌ణ మూర్తి కుమార్తె అక్షత మూర్తిని సున‌క్ పెళ్లి చేసుకున్నారు. వీరిద్ద‌రూ కాలిఫోర్నియాలో చ‌దువుకున్న‌ప్పుడు ఏర్ప‌డిన ప‌రిచయం.. ఆ త‌ర్వాత వివాహం జ‌రిగింది. ఈ దంపతులకు కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్నారు.

రిషి సునక్ తొలిసారిగా 2015లో  బ్రిట‌న్ పార్ల‌మెంటుకు ఎన్నిక‌య్యారు. యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నుంచి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి గెలుపొందారు. సునక్ కన్జర్వేటివ్ పార్టీ శ్రేణులల్లో కొత్త ఉత్సాహం నింపుతూ.. త‌క్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'బ్రెక్సిట్' కోసం పిలుపులకు మద్దతు ప్ర‌క‌టించారు. బోరిస్ జాన్సన్ తన 'లీవ్ EU' ప్రచారంలో మద్దతుదారులలో ఒకరుగా ఉన్నారు.  సునక్ ఫిబ్రవరి 2020లో అత్యంత ముఖ్యమైన UK క్యాబినెట్ పదవి ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్‌చెకర్‌కి నియమించబడినప్పుడు కొత్త చరిత్ర సృష్టించాడు. క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో వ్యాపారాలు, ఉద్యోగులకు సహాయం చేయడానికి అనేక ఆర్థిక ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించారు. మహమ్మారి సమయంలో సున‌క్ మ‌రింత ప్రజాదరణ పొందారు. 

క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలోని ఆర్థిక ప్యాకేజీలో ఉద్యోగాలు నిలుపుదల కార్యక్రమం కూడా ఉంది. ఇది UKలో సామూహిక నిరుద్యోగాన్ని నిరోధించిందని నివేదిక‌లు పేర్కొన్నాయి. అయినప్పటికీ, 'పార్టీగేట్' కుంభకోణం తరువాత అతని ప్రజాదరణ దెబ్బతింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం, లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్రభుత్వ కార్యాలయాలలో  పార్టీలను నిర్వహించడం, లండన్ పోలీసులు జరిమానా విధించిన అధికారులలో ఆయ‌న ఒక‌రుగా ఉండ‌టం గ‌మ‌నార్హం. దీంతో ఆయ‌న పాపులారిటీపై ప్ర‌భావం ప‌డింది. అయితే, బోరిస్ జాన్స‌న్ ను వ్య‌తిరేకిస్తూ రాజీనామా చేయ‌డంతో ప్ర‌ధాని రేసులో తెర‌మీద‌కు వ‌చ్చారు. అలాగే, త‌న భార‌త్య నివాసానికి పన్ను లేని హోదా కోసం  ప్ర‌య‌త్నాలతో విమర్శలను ఎదుర్కొన్నాడు. పన్ను స్థితి మరొక దేశంలో జన్మించిన వ్యక్తి లేదా వారి తల్లితండ్రులు మరొక దేశానికి చెందినవారైతే, UKలో వారి UK ఆదాయంపై మాత్రమే పన్ను చెల్లించడానికి అనుమతిస్తుంది. ఈ వ్యవస్థ విదేశీ వలసదారులు UKలో నివసించే అన్ని ప్రయోజనాలను ఆస్వాదించడానికి అనుమతిస్తుంది.  అదే సమయంలో UK పన్నులలో చాలా తక్కువ చెల్లిస్తారు.

అతను ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, సునక్ ఉన్నత ఉద్యోగంపై దృష్టి సారించడం గురించి UK మీడియాలో ఊహాగానాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, అక్టోబర్ నుండి UKకి కొత్త ప్రధానమంత్రి పదవిలో ఉండ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే సునాక్ యూకేను, ఆయ‌న పార్టీని నడిపించే మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా నిల‌వ‌నున్నారు. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !