లాక్ డౌన్ పార్టీపై జోక్స్... మండిపడ్డ బ్రిటన్ ప్రధాని..!

By Ramya news teamFirst Published Dec 8, 2021, 1:05 PM IST
Highlights

ఆసమయంలో కరోనా ఉద్రుతంగా ఉందని.. ఇద్దరికి మించి.. ఎవరూ ఎక్కువగా గుమ్మికూడదని ప్రభుత్వం రూల్స్ పాస్ చేసింది. వాటికి భిన్నంగా.. కిస్మస్ పార్టీ గురించి.. ప్రభుత్వానికి సంబంధించిన వారే.. జోక్స్ వేసుకోవడం గమనార్హం. 

గతేడాది కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విలయతాండవం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. ఈ మహమ్మారి కారణంగా  పలు దేశాల్లో లాక్ డౌన్ కూడా విధించారు. బ్రిటన్ లోనూ.. కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అక్కడ లాక్ డౌన్ విధించారు. అయితే.. లాక్ డౌన్ సమయంలోనూ.. బ్రిటన్ లో గతేడాది క్రిస్మస్ పార్టీ నిర్వహించారు.  దానిపై సీనియర్ సహాయకులు జోక్స్ వేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా లీక్ కావడంతో.. దానిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మండిపడ్డారు.

Also Read: Omicron : రాబోయే వారాల్లో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం.. యూరోపియన్ ఆరోగ్య సంస్థ హెచ్చరిక...

అక్కడ దేశంలో లాక్ డౌన్ రూల్స్ ని ప్రభుత్వం ఉల్లంఘించందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో.. అక్కడి ఆరోగ్య కార్యదర్శి ఒకరు కరోనా రూల్స్ బ్రేక్ చేసి దొరికిపోయి.. తన పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా..  ఆసమయంలో కరోనా ఉద్రుతంగా ఉందని.. ఇద్దరికి మించి.. ఎవరూ ఎక్కువగా గుమ్మికూడదని ప్రభుత్వం రూల్స్ పాస్ చేసింది. వాటికి భిన్నంగా.. కిస్మస్ పార్టీ గురించి.. ప్రభుత్వానికి సంబంధించిన వారే.. జోక్స్ వేసుకోవడం గమనార్హం. 

ఇదిలా ఉండగా... సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ జట్‌ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేసేపనిలో పడిపోయింది.. ఇప్పటికే 57 దేశాలకు పాకేసిన ఒమిక్రాన్‌ కేసులు కొన్ని దేశాల్లో పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి.. బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్ విలయమే సృష్టిస్తోంది.. ఒకే రోజు 101 కొత్త కేసులు నమోదయ్యాయి.. దీంతో.. అక్కడి ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ వేరియంట్ కేసుల సంఖ్య 437కు చేరుకుందని బ్రిటిన్‌ ఆరోగ్య అధికారులు వెల్లడించారు..

Also Read: Omicron: అలాంటి సంకేతాలు ఏమి లేవు.. డేల్టా కంటే తీవ్రత తక్కువే.. గుడ్ న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్‌వో

 డెల్టా వేరియంట్‌ కంటే కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కేబినెట్‌ సమావేశంలో వ్యాఖ్యానించారు.. కొత్త వేరియంట్‌ భయాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. వైరస్‌ కట్టడికి చర్యలు చేపట్టాలని సూచించారు.. మరోవైపు కరోనా పాజిటివ్‌ కేసులు ఇంకా భారీగానే వెలుగుచూస్తున్నాయి బ్రిటన్‌.. కొత్తగా 45,691 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 10,560,341కు చేరింది. ఇక, ఇప్పటి వరకు 1,45,826 మంది కోవిడ్‌తో ప్రాణాలు వదిలారు.

click me!