సంతోషంగా ఉండటానికి పురుషులపై ఆధారపడాల్సిన అవసరం లేదని, ఒంటరిగానూ హ్యాపీగా లైఫ్ గడిపేయవచ్చని పేర్కొంటూ ఇటీవలే ఓ బ్రెజిల్ మాడల్ తనను తానే పెళ్లి చేసుకున్నారు. ఓ చర్చి ముందు పెళ్లి కూతురి గెటప్‌లో ఫోజు ఇచ్చిన ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై అనేక ట్రోల్స్ వచ్చాయి. ఓ అరబ్ షేక్ ఆఫర్ వచ్చినట్టు ఆమె తెలిపారు. 5 లక్షల డాలర్లు కట్నం ఇస్తారని, తనను పెళ్లి చేసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారని ఆమె వివరించారు. ఆయన ఆఫర్‌ను తిరస్కరించారని, తానిక్కడ అమ్మకానికి లేరని మాడల్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ఇటీవలే ఓ బ్రెజిలియన్(Brazilian) మాడల్(Model) సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ అయ్యారు. తాను సంతోషంగా ఉండటానికి పురుషులపై ఆధారపడాల్సిన అవసరం లేదని పేర్కొంటూ తనను తానే పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఓ చర్చి ముందు వైట్ బ్రైడ్ డ్రెస్‌లో ఫోజు ఇచ్చిన ఫొటోపై కుప్పలుగా కామెంట్లు వచ్చాయి. ఆ ఫొటోను పోస్టు చేసిన తర్వాతే అరబ్ షేక్(Arab sheikh) తనకు ఓ ఆఫర్(Offer) ఇచ్చాడని పేర్కొంది.
‘నేను ఒంటరిగా ఉండటానికి భయపడేదాన్ని. ఇతరులతో కలిసి ఉండటానికి ప్రయత్నించాను. ముఖ్యంగా జీవితంలో సంతోషంగా ఉండాలంటే పురుషులతో తోడు ఉండాల్సిందేనని అనుకున్నాను. కానీ, కొంత కాలం ఒంటరిగా ఉన్న తర్వాత నాకో ఓ విషయం అర్థమైంది. నన్ను ప్రేమించుకోవడం మొదలుపెట్టాను. ఒంటిగా కూడా సంతోషంగా గడపవచ్చని తెలిసింది. అందుకే దాన్ని వేడుక చేసుకోవాలనుకున్నాను’ అని మాడల్ క్రిస్ గాలెరా వివరించారు.
Cris Galera se casó con ella misma xq según ella: "los hombres son infieles y quieren varias mujeres al mismo tiempo". Ahora ha recibido propuestas d hombres y mujeres pero dice q no piensa divorciarse; aunque si acepta pondrá a la otra persona en 2o lugar. pic.twitter.com/WOSIuLtsjf
— Gerald Abrego (@gerald_abrego)అందుకే తన మిత్రులతో కలిసి ఓ చర్చికి వెళ్లి.. తనను తానే పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించారు. ఈ పోస్టుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. నెగెటివ్ కామెంట్స్ తనను గాయపరచకుండా ఉండటానికి వాటిని పట్టించుకోలేరామె. కానీ, ఆ పోస్టు తర్వాతే ఓ అరబ్ షేక్ నుంచి తనకు ఓ ఆఫర్ వచ్చిందని ఓ డిజిటల్ మీడియా సంస్థకు తాజాగా వెల్లడించారు.
‘నాకు నేను డైవర్స్ ఇచ్చుకోవాలన్నారు. తర్వాత ఆయనను పెళ్లి చేసుకోవాలన్నారు’ అని ఓ అరబ్ షేక్ ఆఫర్ వివరించారు. వరకట్నం కింద 5 లక్షల అమెరికన్ డాలర్లు ఇస్తారని చెప్పారన్నారు. అంతేకాదు, ఓ సారి ఆయనతో మాట్లాడారని చెప్పారు. సూటిగా ఆయన ఆఫర్‌ను తిరస్కరించినట్టు వివరించారు. తాను ఇక్కడ అమ్మకానికి లేనని స్పష్టం చేశారు. ఇలాంటి ఆఫర్‌తో మహిళల గౌరవాన్ని దిగజార్చారని అన్నారు.