ఏడు అడుగుల పురుషాంగం డ్రెస్ ధరించి మహిళలను వేధిస్తున్న నిందితుడు.. అరెస్టు చేసిన బ్రెజిల్ పోలీసులు

Published : Feb 23, 2023, 07:03 PM ISTUpdated : Feb 23, 2023, 07:04 PM IST
ఏడు అడుగుల పురుషాంగం డ్రెస్ ధరించి మహిళలను వేధిస్తున్న నిందితుడు.. అరెస్టు చేసిన బ్రెజిల్ పోలీసులు

సారాంశం

బ్రెజిల్‌లో ఓ వ్యక్తి పురుషాంగం ఆకారంలో డ్రెస్ రూపొందించుకుని ధరించాడు. ఆ డ్రెస్‌లోనే కొందరు మహిళలను వేధించాడు. ఈ వేధింపులు ఎదుర్కొన్న కొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియో నగరంలో పోలీసులు ఆ వ్యక్తిని సండే అరెస్టు చేశారు.  

న్యూఢిల్లీ: బ్రెజిల్ ఓ వ్యక్తి పురుషాంగం ఆకారంలో కుట్టించుకున్న ఓ కాస్ట్యూమ్ ధరించి మహిళలను వేధించాడు. దీనిపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ పీనిస్ డ్రెస్‌లో ఉన్న వ్యక్తి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో ఆ వ్యక్తి ఇలా ఆదివారం దర్శనం ఇచ్చి కొందరు మహిళలను వేధించాడు. పలువురు మహిళలు ఫిర్యాదు చేయడంతో మిలిటరీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

బ్లాక్ కలర్‌ వస్త్రంతో పురుషాంగం ఆకారంలో కుట్టించుకున్నాడు. అది ధరిస్తే ఆ వ్యక్తి ముఖం, పాదాలు మినహా మరే బాడీ పార్టు కనిపించడం లేదు. 

రియో నగరంలో ముఖ్యంగా కార్నివాల్‌కు వెళ్లుతున్న మహిళలు ఈ ఆకారం పట్ల ఇబ్బంది పడ్డారు. సిటీ పారాడేస్‌లో పార్టిసిపేట్ చేయబోతున్న మహిళలను ఆ వ్యక్తి అదే అసభ్యకర డ్రెస్‌లో చేజ్ చేశాడని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.

Also Read: అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం.. కెనడా పౌరసత్వాన్ని వదులుకుంటున్న బాలీవుడ్ యాక్టర్

ఇలా అభ్యంతరకరంగా డ్రెస్ చేసుకుని పోలీసుల చేతికి చిక్కిన వారి జాబితాలో ఇంకొందరు ఉన్నారు. 20 ఏళ్ల ఓ వ్యక్తి జైలు డ్రెస్‌లో కనిపించాడు. రెడ్ టాప్, షార్ట్స్ ధరించాడు. 

ఇలా అభ్యంతరకర రీతిలో కనిపించిన ఓ వ్యక్తి దగ్గరి నుంచి పోలీసులు 15 పోర్షన్ల గంజాయి, 15 పోర్షన్ల కొకెయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఓ బమ్ బ్యాగ్‌లో కుక్కి ఉంచినట్టు పోలీసులు వివరించారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే