పాకిస్తాన్ లో దారుణం.. కడుపులోనే తల ఉంచేసి, కుట్టేసి.. ప్రసవం కోసం వస్తే నరకం చూపించారు..

By SumaBala BukkaFirst Published Jun 21, 2022, 11:03 AM IST
Highlights

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది అప్పుడే పుట్టిన శిశువు తలను వేరు చేసి తల్లి కడుపులో వదిలేశారు. నిందితులను కనిపెట్టి, ఘటనపై లోతుగా వెళ్లేందుకు మెడికల్ ఎంక్వైరీ బోర్డును ఏర్పాటు చేశారు.

పాకిస్తాన్ : పాకిస్తాన్ తో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. వైద్యసిబ్బంది తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగా ఓ నవజాత శిశువు కళ్లు తెరవకుండానే ప్రాణాలు కోల్పోగా.. బాలింత పరిస్థితి జీవన్మరణ సమస్యగా మారింది. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం (RHC)లో ఈ ఘటన జరిగింది. అక్కడి సిబ్బంది గర్భిణీకి ప్రసవం చేసే సమయంలో నవజాత శిశువు తలను వేరు చేసి, తల్లి కడుపులోనే ఉంచేశారు. దీంతో 32 ఏళ్ల హిందూ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. 

ఇది తెలిసిన సింధ్ ప్రభుత్వం సంఘటన పూర్వాపరాలు పరిశీలించడానికి, దోషులను కనిపెట్టడానికి మెడికల్ ఎంక్వైరీ బోర్డును ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెడితే.. "తార్పార్కర్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన భీల్ హిందూ మహిళ, ప్రసవం కోసం మొదట తన ప్రాంతంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి (RHC) వెళ్ళింది, కానీ మహిళా గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో, అక్కడి అనుభవం లేని సిబ్బంది ఆమెకు వైద్యం అందించారు. దీంతో పరిస్థితి విషమంగా మారింది" అని ప్రొఫెసర్ రహీల్ సికందర్ చెప్పారు. ఆయన జంషోరోలోని లియాఖత్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ (LUMHS) గైనకాలజీ విభాగానికి అధిపతిగా ఉన్నారు.

ఆర్‌హెచ్‌సి సిబ్బంది ఆదివారం ఆమెకు ఆపరేషన్ చేశారు. ఈ సమయంలో వారి అనుభవ లేమి వల్ల శిశువు తల తెగిపోయింది... దీంతో అలాగే లోపల ఉంచేశారు. దీంతో మహిళ ప్రాణాపాయ పరిస్థితిలోకి జారుకుంది. దీంతో, ఆమెను మిథిలోని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ ఆమెకు చికిత్స చేయడానికి సౌకర్యాలు లేవు. చివరికి, ఆమె కుటుంబ సభ్యులు ఆమెను LUMHSకి తీసుకువచ్చారు, అక్కడ నవజాత శిశువు మిగిలిన శరీరాన్ని తల్లి గర్భం నుండి బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాపాయస్థితినుంచి బయటపడింది అని ఆయన తెలిపారు.  

శిశువు తల గర్భాశయం లోపల చిక్కుకుపోయిందని, తల్లి గర్భాశయం ఛిద్రమైందని, శస్త్రచికిత్స ద్వారా ఆమె పొత్తికడుపు తెరిచి తలను బయటకు తీయాలని.. అలా వెంటనే చేస్తేనే ఆమె ప్రాణాలను కాపాడొచ్చని సికందర్ చెప్పారు. ఈ భయంకరమైన తప్పిదం గురించి సింధ్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జుమాన్ బహోటోను ఈ కేసుపై ప్రత్యేక విచారణలకు ఆదేశించింది.

ముఖ్యంగా చచ్రోలోని ఆర్‌హెచ్‌సీలో గైనకాలజిస్టు, మహిళా సిబ్బంది లేకపోవడంతో ఏం జరిగిందో విచారణ కమిటీ తేలుస్తుందని చెప్పారు. స్ట్రెచర్‌పై పడుకుని వీడియో తీయడం వల్ల ఆ మహిళ గాయపడాల్సి వచ్చిందన్న నివేదికలను కూడా విచారణ కమిటీ పరిశీలిస్తుంది. "కొంతమంది సిబ్బంది గైనకాలజీ వార్డులోని మొబైల్ ఫోన్‌లో ఆమె ఫోటోలను తీసి వివిధ వాట్సాప్ గ్రూపులతో ఆ చిత్రాలను పంచుకున్నారు" అని జుమాన్ జోడించారు.

click me!