పోరాట ఆయుధం.. తెల్ల కాగితం! చైనాలో బ్లాంక్ పేపర్‌లతో కొవిడ్ ఆందోళనలు.. ఎందుకో తెలుసా?

By Mahesh KFirst Published Nov 27, 2022, 5:42 PM IST
Highlights

చైనా ఆందోళనల్లో తెల్ల కాగితం ఒక ఆయుధంగా మారింది. నిరసనకారులు బ్లాంక్ పేపర్ షీట్‌తో నిరసనలు చేస్తున్నారు. సెన్సార్‌షిప్ నుంచి రక్షించుకోవడానికి, అరెస్టు కాకుండా కూడా ఈ తెల్ల కాగితాలను వ్యతిరేకతకు సింబాలిక్‌గా ఆందోళనకారులు ఉపయోగిస్తున్నారు.
 

న్యూఢిల్లీ: చైనాలో అరుదుగా కనిపించే ఆందోళనలు.. ఇప్పుడు పెల్లుబికాయి. కరోనా ఆంక్షలను వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్డెక్కారు. సోషల్ మీడియాలో వ్యక్తమైన వ్యతిరేకత ఇప్పుడు చైనా వీధుల్లోకి దిగింది. చైనా వీధులు, టాప్ విశ్వవిద్యాలయాల్లో ఈ ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఆందోళనల్లో కొత్తగా కనిపించిందేమంటే.. ఆందోళనకారులు బ్లాంక్ పేపర్‌లను ప్రదర్శించడం.

నాంజింగ్, బీజింగ్‌లలో టాప్ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు బ్లాంక్ పేపర్ షీట్లు చేతబట్టుకుని నిరసన మార్గంలో దిగారు. బ్లాంక్ పేపర్ చేతిలో పట్టుకుని మౌనంగా దర్నాలు చేస్తున్నారు. సెన్సార్‌షిప్‌ నుంచి, అరెస్టుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి పౌరులు ఈ ఆందోళకారులు బ్లాంక్ పేజెస్ వాడుతున్నట్టు తెలుస్తున్నది. 

2020 హాంకాంగ్ ప్రొటెస్టుల సమయంలోనూ నిరసకారులు బ్లాంక్ పేపర్ షీట్లను రైజ్ చేసేవారు. నేషనల్ సెక్యూరిటీ చట్టం కింద నిషేధించిన స్లోగన్స్‌ను ఇవ్వకుండా.. వాటికి బదులుగా ఈ వైట్ పేపర్‌లను యూజ్ చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రభుత్వంపై వ్యతిరేకతను ఈ వైట్ షీట్‌తో సింబాలిక్‌గా నిరసనకారులు వ్యక్తపరుస్తున్నారు. అయితే, చైనా ప్రభుత్వం కూడా దీనిపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది.

Also Read: జీ జిన్‌పింగ్.. డౌన్.. డౌన్! చైనీస్ కమ్యూనిస్టు పార్టీ.. డౌన్.. డౌన్! చైనాలో పెల్లుబికిన పౌరుల ఆందోళనలు

కొందరైతే భౌతికంగా హాజరుగా లేనివారు సోషల్ మీడియాలో వైట్ పేపర్ షీట్ల ఫొటోలను అప్‌లోడ్ చేసి సంఘీభావం చెబుతున్నారు. వీబోలో వైట్ పేపర్ ఎక్సర్‌సైజ్ హ్యాస్‌ట్యాగ్‌ ట్రెండ్ అయింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను బ్లాక్ చేశారు. దీంతో మీరు బ్లాంక్ పేపర్ షీట్‌కకు కూడా భయపడితే అంతర్గతంగా మీరు చాలా బలహీనంగా ఉన్నారు అని ఓ వీబో యూజర్ పోస్టు చేశారు.

కమ్యూనికేషన్ యూనివర్సిటీ ఆఫ్ చైనాలో ఓ మహిళ బ్లాంక్ పేజీ పట్టుకుని నిరసన చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆమె దగ్గర నుంచి ఆ పేపర్‌ను తొలగించే ప్రయత్నం చేశాడు. మరికొన్ని చిత్రాల్లో కొందరు బ్లాంక్ పేపర్‌లను పైకి విసిరే మొబైల్ ఫ్లాష్ లైట్లతో వాటిని హైలైట్ చేశారు. సింగువా యూనివర్సిటీలోనూ నిరసనకారులు వైట్ పేపర్ షీట్లను పట్టుకుని నిరసనలు చేస్తూ కనిపించారు.

ప్రపంచమంతా కరోనాతో నివసించడానికి ప్రయత్నాలు చేస్తుంటే చైనా మాత్రం జీరో కోవిడ్ పాలసీని అమలు చేస్తున్నది.
 

click me!