వైట్ హౌస్ ను వీడేది లేదంటూ డోనాల్డ్ ట్రంప్ మొరాయింపు

Arun Kumar P   | Asianet News
Published : Nov 09, 2020, 10:46 AM ISTUpdated : Nov 09, 2020, 10:50 AM IST
వైట్ హౌస్ ను వీడేది లేదంటూ డోనాల్డ్ ట్రంప్ మొరాయింపు

సారాంశం

284 ఎలక్టోరల్ ఓట్లతో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నాడు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ 213 ఓట్లకే పరిమితమయ్యి రెండోసారి అధ్యక్ష పదవిని దక్కించుకోలేకపోయాడు. 

వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై డెమోక్రాట్ అభ్యర్ధి జో బైడెన్ తిరుగులేని ఆదిపత్యాన్ని ప్రదర్శించి 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే చివరివరకు ఓటమిని అంగీకరించని ట్రంప్ ఎన్నికల ఫలితాల వెల్లడిని అడ్డుకోడానికి ప్రయత్నించాడు. అయినప్పటికి అతడి ఆటలు సాగలేదు. అతడెన్ని ఆరోపణలు చేసినా, కౌంటింగ్ ను అడ్డుకోడానికి ఎంత ప్రయత్నించినా బైడెన్ విజయాన్ని అడ్డుకోలేకపోయాడు. 

284 ఎలక్టోరల్ ఓట్లతో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నాడు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ 213 ఓట్లకే పరిమితమయ్యి రెండోసారి అధ్యక్ష పదవిని దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో అధ్యక్ష నివాస భవనం వైట్ హౌస్ దిశగా బైడెన్ అడుగులు వేస్తుండగా ఆ ప్రయత్నాలను అడ్డుకోడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. ఓటమిని అంగీకరించడానికి సిద్దంగా లేని ట్రంప్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై న్యాయపోరాటం కొనసాగించనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశాడు.

READ MORE  షాక్ మీద షాక్: డోనాల్డ్ ట్రంప్ నకు మెలానియా విడాకులు?

ఇక అమెరికా ఎన్నికల పూర్తి ఫలితం వెలువడిన తర్వాత ట్రంప్ ఓటమి ఖాయమయ్యింది. దీంతో ఒత్తిడిని అధిగమించేందుకు ట్రంప్ గోల్ప్ ఆడినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు తనకు వ్యతిరేకంగా వచ్చినట్లు తెలిసిన వెంటనే  గోల్ప్  క్లబ్ కు వెళ్లిన ట్రంప్ చాలాసేపు అక్కడే గడిపాడట. గోల్ప్ ఆడుతూ ఓటమి ఒత్తిడిని జయించే ప్రయత్నం చేశాడు. పోటోమాక్ నది మీదుగా వర్జీనియాలోని స్టెర్లింగ్ లోని నేషనల్ గోల్ప్ కోర్సుకు వెళ్లాడని స్థానిక మీడియా తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

30 ఏళ్ల త‌ర్వాత కండోమ్‌ల‌పై ప‌న్ను విధించిన ప్ర‌భుత్వం.. కార‌ణం ఏంటంటే?
ప్ర‌పంచంలో జైలు లేని దేశం ఏదో తెలుసా.? అత్యంత సుర‌క్షిత‌మైన ప్ర‌దేశం ఇదే