బంగ్లాదేశ్‌లో హింస: 300 మంది మరణం.. సురక్షిత ప్రాంతానికి ప్రధాని హసీనా తరలింపు

By Galam Venkata RaoFirst Published Aug 5, 2024, 3:55 PM IST
Highlights

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఆ దేశంలో అల్లర్ల నేపథ్యంలో 300 మందికిపైగా మరణించారు. ఈ నేపథ్యంలో ప్రధాని హసీనా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.

తీవ్ర హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్‌ అట్టుడుకుతోంది. ఆదివారం జరిగిన ఘర్షణల్లో వంద మందికి పైగా మరణించారు. దీంతో ఆ దేశంలో మొత్తం మృతుల సంఖ్య 300కి చేరింది. ఈ పరిణామం ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి షేక్‌ హసీనా ముందు జాగ్రత్త చర్యగా అధికారిక నివాసమైన ఢాకా ప్యాలెస్‌ను వీడి సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. 

Latest Videos

ప్రధాని హసీనాతో పాటు ఆమె సోదరి ఢాకా నుంచి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లినట్లు సమాచారం. కొన్ని మీడియా సంస్థలు ఆమె భారత్‌కు వెళ్లారని, మరికొన్ని వేరే దేశానికి వెళ్లారని చెబుతున్నాయి. 

బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి నివాసమైన గణభాబన్‌ను వేలాది మంది నిరసనకారులు ముట్టడించారు. దీంతో అక్కడ పెద్ద విధ్వంసం జరిగింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ను ఆర్మీ ఆధీనంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. కాగా, బంగ్లాదేశ్‌ ప్రజలను ఉద్దేశించి ఆ దేశ ఆర్మీ చీఫ్‌ వాకర్‌-ఉజ్‌-జమాన్‌ ప్రసంగించబోతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

click me!