ప్రధానంటే కెప్టెన్‌గా జట్టును నడిపించడం కాదు.. ఇమ్రాన్‌పై అజార్ వ్యాఖ్యలు

First Published Jul 28, 2018, 1:27 PM IST
Highlights

పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవికి అడుగు దూరంలో నిలిచారు. ఒక క్రీడాకారుడు దేశ అత్యున్నత పదవిని స్వీకరిస్తుండటంపై క్రీడాలోకం ఇమ్రాన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతని సమకాలీకుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ స్పందించారు

పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవికి అడుగు దూరంలో నిలిచారు. ఒక క్రీడాకారుడు దేశ అత్యున్నత పదవిని స్వీకరిస్తుండటంపై క్రీడాలోకం ఇమ్రాన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతని సమకాలీకుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ స్పందించారు. కెప్టెన్‌గా ఇమ్రాన్ తెలివైన, సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకునేవారు.

కానీ ఒక దేశ క్రికెట్ జట్టును నడిపించడం.. ఒక దేశాన్ని నాయకుడిగా నడిపించడం ఒక్కటి కాదని అభిప్రాయపడ్డారు. ఖాన్ ప్రధాని పదవిని చేపడితే ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అయితే ఆయన సాహోసోపేత నిర్ణయాలతో ముందుకు వెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పాక్‌లో ఉన్న అంతర్గత సమస్యలను పరిష్కరించిన తర్వాతనే భారత్‌తో సంబంధాలపై ఆయన స్పందించే అవకాశం ఉందని అజహరుద్దీన్ అభిప్రాయపడ్డారు.

ఏదీ ఏమైనా ఒక క్రికెటర్ దేశానికి ప్రధానిగా మారడం చాలా సంతోషంగా ఉందని.. తన తరపున శుభాకాంక్షలు తెలిపారు. 80వ దశకంలో అజహర్, ఇమ్రాన్‌ల మధ్య మైదానంలో హోరాహోరీ పోరు నడిచింది. అయినప్పటికీ మైదానం బయట వీరిద్దరూ స్నేహంగా మెలిగేవారు.

click me!