భారత్ ఒక అడుగు ముందుకేస్తే మేం రెండడుగులు వేస్తాం: ఇమ్రాన్ ఖాన్

First Published Jul 27, 2018, 11:02 AM IST
Highlights

భారత్ తో సత్సంబంధాలు కొనసాగించడానికి తాము సిద్దంగా ఉన్నట్లు పాకిస్థాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన పీటీఐ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ప్రధాని అభ్యర్థి ఆయన ఇమ్రాన్ ఖాన్ ఫలితాల తర్వాత మొదటిసారి ప్రజలనుద్దేశించి  ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఆయన వివిధ దేశాలతొ పాకిస్థాన్ సంబంధాలు ఎలా ఉండనున్నాయో వివరించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ భారత్ తమకు మిత్ర దేశమేనని, ఆ దేశంతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలిపారు.

శాంతి దిశగా భారత్ ఒకడుగు ముందుకేస్తే మేం రెండడుగులు ముందుకేస్తామని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఇక కశ్మీర్, బలూచిస్థాన్ విశయంలో భారత్, పాకిస్థాన్ ఇరు దేశాలు పరస్పరం నిందలకు దిగడం తగదన్నారు. పలు కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలకు, ఒప్పందాలకు ప్రయత్నించి సంబంధాలను మెరుగుపర్చుకోడానికి ప్రయత్నిస్తామని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.

భారత్ లో చాలా మంది తనకు వ్యక్తిగతంగా తెలుసన్నారు ఇమ్రాన్. క్రికెటర్ గా ఉన్న సమయంలో ఈ పరిచయాలు ఏర్పడి ఇప్పటికీ కొనసాగుతున్నట్లు తెలిపారు. అయితే భారత మీడియా మాత్రం తన్నో విలన్ గా చూపించి ప్రజల్లో తనపై వ్యతిరేకత పెరిగేలా చేసిందన్నారు. కానీ తనకు భారత ప్రజల పట్ల ఎంతో అభిమానం ఉందని ఇమ్రాన్ అన్నారు. అందువల్లే ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనాలని కోరుకుంటున్నానని ఇమ్రాన్ స్పష్టం చేశారు.

click me!