బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ రహస్య వివాహం

By narsimha lodeFirst Published May 30, 2021, 10:43 AM IST
Highlights

 బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైమండ్స్ ను వెస్ట్‌మినిస్టీరియల్ కాథడ్రెల్ లో రహస్యంగా వివాహం చేసుకొన్నారని విదేశీ మీడియా కథనం ప్రచురించింది.
 

లండన్: బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైమండ్స్ ను వెస్ట్‌మినిస్టీరియల్ కాథడ్రెల్ లో రహస్యంగా వివాహం చేసుకొన్నారని విదేశీ మీడియా కథనం ప్రచురించింది.అయితే  ఈ విషయమై జాన్సన్ కార్యాలయ ప్రతినిధి మాత్రం వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. బ్రిటీష్ ప్రధాని  వివాహం గురించి ఆయన మంత్రివర్గంలోని సీనియర్లకు కూడ తెలియదని విదేశీ మీడియాకు చెందిన రెండు పత్రికలు ప్రచురించాయి. చివరి నిమిషంలో  కొందరు అతిథులకు మాత్రం ఈ వివాహనికి ఆహ్వానం అందిందని మీడియా ప్రకటించింది.కరోనా నేపథ్యంలో లండన్ లో పెళ్లికి 30 మంది కంటే ఎక్కువ మంది హాజరు కావడం నిషేధం.  ఈ కారణంగా కూడ తక్కువ మంది అతిథులకు సమాచారం పంపారని తెలుస్తోంది.

బోరిస్ జాన్సన్ వయస్సు 56 ఏళ్లు. సైమండ్స్ వయస్సు 33 ఏళ్లు. 2019 నుండి బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి అయినప్పటి నుండి వీరిద్దదరూ సహజీవనం చేస్తున్నారు. డౌనింగ్ స్ట్రీట్లో కలిసి ఉంటున్నారు.గత ఏడాది తమకు నిశ్చితార్థం జరిగిందని త్వరలో ఒక బిడ్డను ఆశిస్తున్నామని ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ దంపతులకు నికోలస్ జాన్సన్ జన్మించాడు. 

ఈ వివాహనికి సంబంధించి జూలై 2022లో స్నేహితులు, కుటుంబసభ్యులకు  పంపినట్టు సన్ పత్రిక ప్రకటించింది. వివాహేతర సంబంధం గురించి అబద్దాలు చెప్పినందుకు విపక్షంలో ఉన్న సమయంలో ఆయనను ఒకసారి కన్వర్జేటివ్ పార్టీ విధాన బృందం నుండి తొలగించారు. అతను రెండుసార్లు విడాకులు తీసుకొన్నారు. తనకు ఎంతమంది పిల్లలు పుట్టారో చెప్పడానికి నిరాకరించారు. అతనికి ఇప్పటికే రెండుసార్లు విడాకులు తీసుకొన్నారు. మెరీనా వీలర్ అనే లాయర్ ను  జాన్సన్ గతంలో వివాహం చేసుకొన్నాడు.  వీరికి నలుగురు పిల్లలు.  2018 సెప్టెంబర్ మాసంలో తాము విడిపోయినట్టుగా మెరీనా ప్రకటించింది.

click me!