దారుణం.. యువకుడిని షూట్ చేసి, బహిరంగ మర్కెట్ లో వేలాడదీసిన తాలిబన్లు..

By team teluguFirst Published Jul 24, 2022, 1:46 PM IST
Highlights

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు ఆగడం లేదు. వారికి నచ్చిన విధంగా ప్రవర్తిస్తున్నారు. హత్యలు చేస్తూ మానవహక్కులను ఉల్లంఘిస్తున్నారు. తాజాగా ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి అతడి మృతదేహాన్ని బహిరంగ మార్కెట్ లో వేలాడదీశారు. 

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మరింత ప్రమాదకరంగా మారుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని బగ్లాన్ ప్రావిన్స్‌లోని అందరాబ్ జిల్లాలో ఒక యువకుడిని కాల్చి చంపారు. అనంతరం అతడి మృతదేహాన్ని జిల్లాలోని మార్కెట్ దగ్గరకి తీసుకెళ్లి బహిరంగంగా ఉరితీశారు. ఈ ప‌రిణామం యావ‌త్ ప్ర‌పంచాన్ని ఒక్క సారిగా ఉలిక్కిప‌డేలా చేసింది. 

బర్త్ డే పార్టీ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

స్థానిక మీడియా వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. కసా తరాష్ ప్రాంతంలోని అందరాబ్‌లో నివసించే వ్య‌క్తి ఇంటికి స‌మీపంలోకి జూలై 20వ తేదీన తాలిబ‌న్లు వెళ్లారు. ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని బ‌ల‌వంతం చేశారు. అనంత‌రం అత‌డిని కాల్చి చంపారు. అయితే అత‌డి భ‌వ‌నం ముందు గుమిగూడిన ప్రజలను కూడా తాలిబన్లు ఏరియల్ ఫైరింగ్ ద్వారా చెదరగొట్టారని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ఆ మృత‌దేహాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు బ‌హిరంగ మార్కెట్ కు తీసుకొచ్చి, వేలాడదీసి దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డారు. 

First Monkeypox Case In Delhi: మంకీపాక్స్ క‌ల‌క‌లం.. ఢిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు గుర్తింపు

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐక్యరాజ్యసమితి మిషన్ (UNAMA) ఆఫ్ఘనిస్తాన్‌లో 10 నెలల తాలిబాన్ పాలన తీరు, ఏక‌ప‌క్ష హ‌త్య‌లకు సంబంధించిన నివేదికను స‌మ‌ర్పించిన ఒక రోజు త‌రువాత ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన చోటు చేసుకుంది.  గత 10 నెలల కాలంలో పది మందికి పైగా మాజీ భద్రతా దళాలు, సిబ్బందిని తాలిబ‌న్లు హ‌త‌మార్చారు.`

Afghanistan: New report highlights multiple human rights violations since Taliban takeover, including arbitrary arrests, torture & extrajudicial killings.

The de facto authorities must investigate & perpetrators must be held accountable.https://t.co/t0J5YH3a2r

— United Nations (@UN)

 
జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మిషన్ త‌న తాజా UNAMA నివేదిక‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ‘‘ మానవ హక్కుల ఉల్లంఘన’’ను బహిర్గతం చేసింది. దేశంలోకి తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత దేశ పరిస్థితి ఎలా ఉందో, అక్కడి పరిస్థితి ఎలా దిగజారిపోయిందో నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా నివేదికలో ఆఫ్ఘనిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై సవివరమైన సమాచారం అందజేసింది. పౌరుల రక్షణ, చట్టవిరుద్ధమైన హత్యలు, చిత్రహింసలు, అధికార దుర్వినియోగం, ఏకపక్ష అరెస్టులు, నిర్బంధాలు, ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు, బాలికల హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలు, నిర్బంధ ప్రదేశాలలో పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ నివేదిక వెల్ల‌డించింది. 

కుప్ప‌కూలిన మూడంస్తుల భ‌వనం.. ఒక‌రు మృతి.. మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు..

ఈ నివేదిక ప్రకారం నిరసనలను అణిచివేయడం, మీడియా స్వేచ్ఛను అరికట్టడం ద్వారా వాస్తవికత‌ను క‌ట్ట‌డి చేస్తున్నారు. జర్నలిస్టులు, నిరసనకారులు, ప్రజా సంఘాల కార్యకర్తలను ఏకపక్షంగా అరెస్టు చేయడాన్ని నివేదిక ఖండిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్ లో మానవ హక్కుల పరిస్థితిపై హైకమిషనర్, స్పెషల్ రిపోర్టర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ, ప్రభుత్వేతర సంస్థల మునుపటి ఆవిష్కరణలకు అనుగుణంగా తాలిబన్లు మానవ హక్కుల ఉల్లంఘనల, కలతపెట్టే, స్థిరమైన నమూనాను ఈ నివేదిక నిస్సందేహంగా వెల్లడిస్తుందని తెలిపారని వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. 

ఆఫ్ఘనిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన,  రక్షణను పర్యవేక్షించడంలో డాక్యుమెంటేషన్ చేయడంలో UNAMA కీలక పాత్ర పోషిస్తుంది., ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC), అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC) కూడా మానవ హక్కుల ఉల్లంఘనలను నిరోధించడంలో, ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా జవాబుదారీతనాన్ని నిర్ధారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని UN మిషన్ పేర్కొందని ఏఎన్ఐ తెలిపింది. 
 

click me!