
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌పై గ్యాబ్రియెల్ తుఫాన్ విరుచుకుపడింది. ఈ తుఫాన్ దాటికి ఆ దేశం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉత్తర దీవిలో పెద్ద మొత్తంలో వర్షం కురిసింది. దీంతో మంగళవారం న్యూజిలాండ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటిస్తూ నిర్ణయం వెల్లడించింది.
భారీ వర్షం, బలంగా వీస్తున్న గాలుల కారణంగా వేలాది మంది ఇళ్లు విద్యుత్ లేకుండా పోయిందని మినిస్టర్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ కిరన్ మెక అనాల్టీ తెలిపారు. ఆయనే డిక్లరేషన్ పై సంతకం పెట్టారు. న్యూజిలాండ్‌లో ఎమర్జెన్సీ విధించడం చాలా అరుదు. ఇది వరకు ఈ దేశంలో ఎమర్జెన్సీ స్థితిని రెండు సార్లు మాత్రమే ప్రకటించింది. ఇది మూడో సారి. గతంలో ఒకసారి 2019 క్రైస్ట్ చర్చ్ టెర్రర్ అటాక్స్ సమయంలో ఒకసారి, 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఇంకోసారి దేశంలో ఎమర్జెన్సీ స్టేట్ ప్రకటించారు. తాజాగా, గ్యాబ్రియెల్ తుఫాన్ విరుచుకుపడిన తరుణంలో ఈ ప్రకటనను ప్రభుత్వం చేసింది.
Also Read: కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో చెత్తకుప్పలో 8 ఏళ్ల బాలిక మృతదేహం, హర్యానాలో దుర్ఘటన
గతంలో న్యూజిలాండ్ చూడని విధంగా కురుస్తున్న వర్షం దేశవ్యాప్తంగా దారుణమైన ప్రతికూల పరిస్థితులను కల్పిస్తున్నదని మెక్ అనాల్టీ అన్నారు. భీకర వర్షం కారణంగా దేశంలోని చాలా ఇళ్లు వేటికవిగా సంబంధాలను తెగిపోయి ఉన్నాయని వివరించారు. న్యూజిలాండర్ ప్రజలకు ముప్పు తలపెడుతున్న నిజమైన డేంజర్ సవాల్ ఇది అని తెలిపారు. వెస్ట్ ఆక్లాండ్‌లో ఓ ఇల్లు కూలిపోయిన తర్వాత సహాయక చర్యల్లో పాల్గొన్న ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఒకరు మిస్ అయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు.