కెనడా ఇండియన్ రెస్టారెంట్ లో పేలుడు

Published : May 25, 2018, 11:00 AM IST
కెనడా ఇండియన్ రెస్టారెంట్ లో పేలుడు

సారాంశం

కెనడాలోని టోరంటో శివారులోని మిస్సిసౌగా ప్రాంతంలోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో పేలుడు సంభవించింది.

టోరంటో: కెనడాలోని టోరంటో శివారులోని మిస్సిసౌగా ప్రాంతంలోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 15 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వార్తలను బట్టి తెలుస్తోంది.

బొంబాయి భేల్ రెస్టారెంట్ పేలుడు ఘటనలో గాయపడిన 15మందిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు పీల్ రీజినల్ పారామెడిక్ సర్వీస్ ట్వీట్ చేసింది.

పేలుడు గురువారం రాత్రి 10.30 గంటలకు సంభవించింది. దానికి కారణం ఏమిటనేది తెలియదు. సంఘటన జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయినట్లు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే
20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..