బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం: 15 మంది మృతి, పలువురికి గాయాలు

Published : Oct 23, 2023, 06:02 PM ISTUpdated : Oct 23, 2023, 06:21 PM IST
బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం: 15 మంది మృతి, పలువురికి గాయాలు

సారాంశం

బంగ్లాదేశ్ లో ఇవాళ ఘోర రైలు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో  15 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.


ఢాకా:బంగ్లాదేశ్ లో  సోమవారంనాడు  రైలు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో  15 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.ఇవాళ  సాయంత్రం  04:15 గంటల సమయంలో కిషోర్ గంజ్ నుండి ఢాకాకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు  సుమారు 15 మృతదేహలను  వెలికితీశారు. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న కోచ్ ల కింద చాలా మంది చిక్కుకున్నారని స్థానిక మీడియా  బీడీ న్యూస్24 ప్రకటించింది.

ఇవాళ  సాయంత్రం  04:15 గంటల సమయంలో కిషోర్ గంజ్ నుండి ఢాకాకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు  సుమారు 15 మృతదేహలను  వెలికితీశారు. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న కోచ్ ల కింద చాలా మంది చిక్కుకున్నారని స్థానిక మీడియా  బీడీ న్యూస్24 ప్రకటించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు  80 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది.ఢాకా వెళ్లే గోధూలి ఎక్స్ ప్రెస్ రైలు, ఛటోగ్రామ్ కు వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.  

ఈ ప్రమాదం తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలకు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటి వరకు  15 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని  అధికారులు  తెలిపారని స్థానిక మీడియా తెలిపింది. రైలు కోచ్ లకింద  పలువురు చిక్కుకుపోయినట్టుగా  అధికారులు అనుమానిస్తున్నారు.  ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !