వికీపీడియా తన పేరు మార్చుకుంటే 1 బిలియన్ డాలర్లు ఇస్తానని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ అన్నారు. కానీ దానికి ఓ కండీషన్ పెట్టాడు. అదేంటంటే ?
టెస్లా వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అంటే చాలా మందికి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన చేసిన ట్వీట్లు తరచూ వైరల్ అవుతుంటాయి. కృత్రిమ మేధను ప్రశ్నించడం దగ్గర నుంచి, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ను విమర్శించడం వరకు ఎప్పుడూ దూకుడుతనంతో వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన వికీపీడియాను విమర్శిస్తూ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. అలాగే వికీపీడియాకు కొత్త పేరును సూచించారు.
ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) లో ఓ పోస్టు పెట్టారు. వికీపీడియా పేరును డికిపీడియాగా మారిస్తే, తాను ఒక మిలియన్ డాలర్లు ఇస్తానని వెల్లడించారు. అయితే ఈ పోస్టుకు ఓ యూజర్ స్పందించారు. ఎలాన్ మాస్క్ చెప్పినట్టు పేరు మార్చి, 1 బిలియన్ డాలర్ తీసుకొని, తిరిగి పాత పేరును మార్చుకోవాలని ఓ యూజర్ వికీపీడియాకు సూచించారు. దీనికి మస్క్ వెంటనే స్పందించారు. ఆ కామెంట్ కు బదిలిస్తూ.. తాను మూర్ఖుడిని కానని, తాను సూచించిన పేరు కనీసం ఏడాది పాటు అలాగే ఉండాలని ఓ కండీషన్ పెట్టాడు. అయితేనే 1 బిలియన్ డాలర్ ఇస్తానని చెప్పారు.
I will give them a billion dollars if they change their name to Dickipedia https://t.co/wxoHQdRICy
— Elon Musk (@elonmusk)
undefined
మరో పోస్ట్ లో.. ‘‘వికీపీడియా అమ్మకానికి లేదు, జిమ్మీ వేల్స్ నుండి వ్యక్తిగత విజ్ఞప్తి’’ అని పేర్కొన్న వికీపీడియా హోమ్ పేజీ స్క్రీన్ షాట్ ను ఎలాన్ మస్క్ షేర్ చేశారు. మరి వికీపీడియా ఎందుకు విరాళం కోరుతోందని ఆయన ప్రశ్నించారు. వికీమీడియా ఫౌండేషన్ కు అంత డబ్బు ఎందుకు కావాలని ఎప్పుడైనా ఆలోచించారా అని మస్క్ ప్రశ్నించారు. ‘‘వికీపీడియాను ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ లోనే మొత్తం టెక్ట్స్ టైప్ చేసి, ఆ కాపీని పోస్ట్ చేయవచ్చు. మరి డబ్బు ఎందుకు. తెలుసుకోవాలని ఉంది’’ అని పోస్టు పెట్టారు. తన వికీపీడియా పేజీలో ఆవు, పూప్ ఎమోజీని చేర్చవచ్చా అని మస్క్ ప్రశ్నించారు.
కాగా.. ఎలాన్ మస్క్, వికీపీడియా వైరం ఇప్పుడే కొత్తగా మొదలైందేమీ కాదు. గత మేలో, టర్కీ అధ్యక్ష ఎన్నికలకు ముందు ఎక్స్ (ట్విట్టర్) లో కొంత కంటెంట్ ను పరిమితం చేయాలని మస్క్ తీసుకున్న నిర్ణయాన్ని వికీపీడియా సహ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ విమర్శించారు.
కంటెంట్ ను పరిమితం చేయాలన్న టర్కీ డిమాండ్లకు తలొగ్గి ఎలన్ మస్క్ భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్దతు ఇవ్వకపోవడాన్ని వేల్స్ ఓ పోస్టులో తప్పుపట్టారు. కానీ వికీపీడియా తన సిద్ధాంతాల పట్ల బలంగా నిలబడిందని అన్నారు.