బాంబుల నుంచి రక్షణగా ఏర్పాటు చేసే ఆశ్రయాలు సాధారణంగా బిల్డింగ్‌ల బేస్‌మెంట్ల కింద ఉంటాయి. ఇజ్రాయెల్‌లో ఈ షెల్టర్లు ప్రజల ప్రాణాలు రక్షించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ షెల్టర్‌లో కనీస అవసరాలకు సరిపడా సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఏషియానెట్ న్యూస్ బృందం అలాంటి ఓ బాంబ్ షెల్టర్‌లోపలికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించింది.
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ రోజూ బాంబులతో విరుచుకుపడుతూనే ఉన్నది. ఈ బాంబుల నుంచి రక్షణ కోసం ఇజ్రాయెల్ పౌరులు బాంబ్ షెల్టర్లలో ఆశ్రయం తీసుకుంటున్నారు. ఈ షెల్టర్లు సాధారణంగా బిల్లింగ్‌ల బేస్‌మెంట్లలో ఏర్పాటు చేస్తారు. ఈ బాంబ్ షెల్టర్లు క్షిపణుల నుంచి అనేక మంది ప్రాణాలను కాపాడాయి.
ఏషియానెట్ సువర్ణ న్యూస్ ఎడిటర్ అజిత్ హనమక్కనవర్ ఇలాంటి ఓ బాంబ్ షెల్టర్‌లోకి వెళ్లారు. ఇజ్రాయెల్‌లోని అష్కెలాన్‌లోని బాంబ్ షెల్టర్‌లోకి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ బాంబ్ షెల్టర్ల డోర్లు పటిష్టమైన ఇనుముతో తయారు చేశారు. ఇవి మందంగా ఉండి బయటి నుంచి క్షిపణుల శకలాలు, గన్ ఫైరింగ్, బాంబు పేలుళ్లను కూడా తట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా షెల్టర్ల లోపల ఉండే వారు కూడా బయటకు వెళ్లేలా రెండు వైపులా లాక్, అన్లాక్ చేసేలా ఏర్పాట్లు ఉన్నాయి.
undefined
ఈ షెల్టర్‌ల లోపల కనీసంగా అవసరమయ్యే నీటి సరఫరా, టాయిలెట్లు, ఆహారం, పడకలు ఉన్నాయి. ఒక వేళ అగ్ని ప్రమాదం జరిగినా మంటలను ఆర్పడానికి నీటి సరఫరా ఉన్నది. ఈ ఏర్పాట్లు దాడులు జరుగుతున్న సమయంలో ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి. కనీస అవసరాలను ఇవి అందిస్తాయి.
Also Read: Israel-Hamas War Report: రాజధానిలో ప్రశాంతం, గాజా సరిహద్దులో బీభత్సం
క్షిపణి దాడులు ఎక్కువగా రాత్రిపూటే జరుగుతున్నాయి. కాబట్టి, ప్రజలు పలుమార్లు రాత్రిపూటల్లో ఈ ఆశ్రయాల్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ సాయుధులు యుద్ధంలో ఉన్నప్పుడు వారు ఈ బాంబ్ షెల్టర్లలోనే ఉంటున్నారు. ఈ యుద్ధం పౌరులనూ లక్ష్యంగా చేసుకోవడమే కాదు, ప్రజలను దోచుకోవడం, వారి నివాసాలను నేలమట్టం చేసే హీనమైన చర్యగానూ ఉన్నది.