విమానం ఢీకొని వ్యక్తి మృతి

Published : Nov 22, 2018, 09:36 AM IST
విమానం ఢీకొని వ్యక్తి మృతి

సారాంశం

గాలిలో ఎగిరే విమానం.. మనిషిని ఎలా ఢీకొట్టిందనే అనుమానం కలుగుతోందా.? కానీ అదే నిజం. 

విమానం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన రష్యాలోని మాస్కోలో చోటుచేసుకుంది. గాలిలో ఎగిరే విమానం.. మనిషిని ఎలా ఢీకొట్టిందనే అనుమానం కలుగుతోందా.? కానీ అదే నిజం. 

పూర్తి వివరాల్లోకి వెళితే...రష్యాలోని మాస్కోలో బోయింగ్‌ 737 విమానం ఏథెన్స్‌కు వెళ్లేందుకు టేకాఫ్‌ అవుతుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి రన్‌వేపైకి  దూసుకువచ్చాడు. ఈ క్రమంలో విమానం అతనికి తగిలి.. ప్రాణాలు కోల్పోయాడు.  మృతుడు ఆర్మేనియాకు చెందిన ఆల్బర్ట్‌ ఎప్రెమ్‌యాన్‌ (25)గా గుర్తించారు. 

స్పెయిన్‌ నుంచి వస్తున్న ఆయన మాస్కోలో విమానం మారి మరో దాంట్లో ఆర్మేనియాకు వెళ్లాలి. అయితే.. స్పెయిన్‌ నుంచి వస్తున్న సమయంలో సిబ్బందిపై ఆల్బర్ట్‌ దాడి చేయడంతో పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఆర్మేనియా విమానం ఎక్కించేందుకు పోలీసులు తీసుకెళ్తుండగా.. అకస్మాత్తుగా రన్‌వేపైకి పరుగెత్తాడు. ఆ సమయంలో ఏథెన్స్‌కు వెళ్లే విమానం టేకాఫ్‌ అవుతూ అతన్ని ఢీకొట్టింది.

PREV
click me!

Recommended Stories

US-Iran War :ఈ రాత్రికి అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బాంబు దాడి..? అసలు నిజమేంటి..?
Iran Israel War లోకి ఇండియా ఇండైరెక్ట్ ఎంట్రీ..? ట్రంప్ కు స్ట్రాంగ్ వార్నింగ్..?