పాక్‌కు షాకిచ్చిన ట్రంప్...రక్షణ సాయం నిలిపివేత

By sivanagaprasad kodatiFirst Published Nov 21, 2018, 12:00 PM IST
Highlights

పాకిస్తాన్‌కు అమెరికా గట్టి షాకిచ్చింది.  పాక్‌కు అందే 1.3 బిలియన్ డాలర్ల రక్షణ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాదం విషయంలో పాక్ వైఖరిని తప్పుబట్టిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ తెలిసినా కూడా పాక్ ప్రభుత్వం అమెరికాకు చెప్పలేదని ఆరోపించారు. 

ఆ తర్వాత కొద్ది గంటలకే భద్రతా సాయాన్ని నిలిపివేస్తూ శ్వేతసౌధం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ‘‘ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఇంతకు ముందు పాక్ నేతలు అమెరికాకు చెప్పారు.. కేవలం మాటలే కానీ ఆ దిశగా పాకిస్తాన్ కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు.. దీని వల్ల ఆ దేశానికి సమీపంలో ఉన్న పొరుగు దేశాలు తీవ్రవాదం వల్ల నష్టపోతున్నాయి.

అందుకే పాక్‌కు అందించే రక్షణ నిధులను నిలిపివేస్తున్నట్లు అమెరికా నిర్ణయం తీసుకుంది.. తాలిబన్, లష్కర్ ఏ తోయిబ వంటి ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకుంటే అఫ్గానిస్తాన్‌లోనూ శాంతియుత వాతావరణం నెలకొంటుంది.

ఇలాగే భారత్‌కు వ్యతిరేకంగా ఉండే తీవ్రవాద సంస్థలను అణచివేసి ఉంటే ఆ దేశంతో సాన్నిహిత్యం ఏర్పడి.. పాక్‌కు పలు విధాల లాభం కలిగివుండేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కాగా, ట్రంప్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది.

గతంలో హక్కానీ నెట్‌వర్క్, తాలిబన్ ఉగ్రవాదుల కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు గాను.. గత సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌కు 300 మిలియన్ డాలర్ల మిలటరీ సాయాన్ని ట్రంప్ సర్కార్ రద్దు చేసింది.
 
click me!